ట్రెడ్​మిల్ పై పరుగులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ట్రెడ్​మిల్ పై  పరుగులు..  తీసుకోవాల్సిన  జాగ్రత్తలు

బరువు తగ్గడం, ఫిట్​గా ఉండడం కోసం ట్రెడ్​మిల్​ వర్కవుట్స్​ చేస్తుంటారు చాలామంది. కొత్తగా ట్రెడ్​మిల్​ మీద వాకింగ్​, స్లో రన్నింగ్​ వంటివి చేసేవాళ్లు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి అంటున్నారు ఫిట్​నెస్​ ట్రైనర్స్​. 

  • తొందరగా బరువు తగ్గాలి, ఫిట్​ అవ్వాలి అని ఆలోచిస్తూ ట్రెడ్​మిల్​ మీద రన్నింగ్​ చేయొద్దు. పూర్తిగా మనసు పెట్టి కనీసం 20-–40 నిమిషాలు రన్నింగ్​ చేయాలి. అప్పుడే అనుకున్న రిజల్ట్ వస్తుంది. 
  • ట్రెడ్​మిల్​ మీద వర్కవుట్ చేయడానికి ముందు కచ్చితంగా వామప్​ చేయాలి. వామప్​ స్కిప్​ చేస్తే ట్రెడ్​మిల్​ మీద రన్నింగ్​ చేసేటప్పుడు గాయాలు అయ్యే ఛాన్స్​ ఎక్కువ. అలాగే పరిగెత్తే వేగం కూడా తగ్గుతుంది.
  • పెద్ద అడుగులు వేస్తూ నడవడం, పరిగెత్తడం వల్ల ఇంజ్యూరిస్​ రిస్క్​, కండరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. 
  • ట్రెడ్​మిల్​ మీద వాకింగ్​, రన్నింగ్ చేస్తున్నప్పుడు పదేపదే కాళ్లను చూసుకుంటుంటే బ్యాలెన్స్ తప్పుతుంది. దాంతో కిందపడిపోతారు. అలాకాకుండా మెడ, వెన్నెముక నిటారుగా ఉంచి వాకింగ్​, రన్నింగ్​ చేయాలి.
  • ట్రెడ్​మిల్​ ఒకే రకమైన వర్కవుట్స్​కు మాత్రమే పనికొస్తుందని అనుకుంటారు కొందరు. అయితే, ట్రైనర్​ సాయంతో ట్రెడ్​మిల్​ మీద వెరైటీ ఎక్సర్​సైజ్​లు​ కూడా చేయొచ్చు. 

చాలామంది రన్నింగ్​ బెల్ట్​ మీద ముందుకీ లేదా వెనక్కీ పరిగెత్తుతారు. ఇలాచేస్తే ట్రెడ్​మిల్​ మీద రన్నింగ్​ చేసినా ఉపయోగం ఉండదు.అలాగే, వర్కవుట్స్​ చేసేటప్పుడు ట్రెడ్​మిల్​ బార్​ పట్టుకోవద్దు. చేతులను కదిలిస్తూ బాడీ పోశ్చర్​ మార్చుకోవాలి. ఇలాచేస్తే, ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి.ట్రెడ్​మిల్​ మీద రన్ చేసేందుకు కంఫర్ట్​గా ఉండే షూ వేసుకోవాలి.