4 స్థానంలో నడిపించేదెవరు?..కోహ్లీ రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టెస్టు టీమ్‌లో కీలక స్థానం ఖాళీ

4 స్థానంలో నడిపించేదెవరు?..కోహ్లీ రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టెస్టు టీమ్‌లో కీలక స్థానం ఖాళీ
  • నాలుగో నంబర్‌‌లో  33 ఏండ్లు సేవలందించిన సచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇప్పుడు పోటీలో రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

ఇండియా క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ టెస్టులకు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెప్పాడు. చూడటానికి, వినడానికి బాధగా అనిపిస్తున్నా.. టీమిండియాకు మాత్రం అసలు సినిమా ముందుంది. ఎందుకంటే సచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ.. 33 ఏండ్లపాటు నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా టెస్టు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అద్భుతమైన స్థిరత్వాన్ని తెచ్చారు. వీళ్ల హయాంలో పరుగులు వరదలై పారడంతో పాటు ఎన్నో రికార్డులూ గల్లంతయ్యాయి. అదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా తిరుగులేని విజయాలనూ సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాళీ అయ్యింది. దీంతో ఈ స్థానాన్ని ఇప్పటికిప్పుడు ఆ స్థాయిలో భర్తీ చేసే ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరు? ఇద్దరు లెజెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మైమరిపించే స్థాయిలో ఆడే ఆటగాడు  టీమిండియాలో ఉన్నాడా? బీసీసీఐ ముందున్న ఈ అతిపెద్ద ప్రశ్నకు సరైన జవాబు ఎప్పుడు దొరుకుతుందో చూడాలి? 

వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : టెస్టు ఫార్మాట్‌లో.. ఇండియా టీమ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌‌లో నాలుగో నంబర్‌‌ అత్యంత కీలకమైనది. 1992లో సచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమిండియా నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రమోటై పరుగుల మోత మోగించాడు.  2013లో మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆ బాధ్యతలను స్వీకరించి సమర్థంగా నిర్వహించిన విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ ఇప్పుడు వీడ్కోలు పలికాడు. అంటే దాదాపు 33 ఏండ్లు ఈ ఇద్దరే టీమిండియా విజయాలకు మూల స్తంభమైన నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఒంటి చేత్తో మోశారు.

మూడు దశాబ్దాలుగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాగిన ప్రయాణంలో టీమిండియా ఎన్నో అద్భుతాలు చేసింది. అదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీళ్లద్దరూ కూడా వ్యక్తిగతంగా ఎన్నో మైలురాళ్లు, తిరుగులేని ప్రతిష్టను అందుకోవడంతో పాటు ఇండియా క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇప్పుడు ఆ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముందుకు నడిపించే ఆటగాడి కోసం వేట మొదలైంది. నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 177 టెస్టులు ఆడిన సచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 275 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 54.40 యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 13,492 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు.

ఇందులో 44 సెంచరీలు, 58 ఫిఫ్టీలు ఉన్నాయి. 99 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 160 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిన కోహ్లీ 50.09 యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 7564 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. 26 సెంచరీలు, 21 ఫిఫ్టీలు అతని ఖాతాలో ఉన్నాయి. అయితే ఇంత సుదీర్ఘమైన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్ని రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెంచరీలు చేసే సత్తా ప్రస్తుతప్లేయర్లలో ఉందా? అన్న ప్రశ్నకు మాజీల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ‘ఇదో పెద్ద ప్రశ్న. విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడం అతి పెద్ద లోటు. టెస్టు క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

ఒక రకమైన అభిరుచి, దూకుడుతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడేవాడు. కోహ్లీలో ఉండే గొప్పతనం అదే. నిజం చెప్పాలంటే సెలెక్టర్లు అతనికి కెప్టెన్సీ ఇచ్చి ఉండాల్సింది. రాబోయే రెండు, మూడేళ్లు ఆడిన తర్వాత నిర్ణయం తీసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు అతనికి మనం శుభాకాంక్షలు మాత్రమే చెప్పగలం’ అని మాజీ సెలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెదవి విరిచాడు. పాతతరంలో గంగూలీ, ద్రవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరో 16 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడినా బాగానే సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. దాదా 1188 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా, ద్రవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 957 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాడు.

రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరైనోడా?

ఇప్పుడున్న పరిస్థితుల పరంగా, ఆట పరంగా చూస్తే విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ స్థానాన్ని కొద్దిగానైనా భర్తీ చేసే సత్తా, సామర్థ్యం కేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లుగా అనిపిస్తోంది. శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఓటేశాడు. ఎందుకంటే టెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరంగా రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తిరుగులేదు. దీనికితోడు ఇప్పుడున్న లైనప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతనికే ఎక్కువ అనుభవం ఉంది. ఫెయిలైనా ఒకే స్థానంలో ఎక్కువ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇస్తే రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాడిలో పడతారని అందరూ భావిస్తున్నారు.

కానీ సెలెక్టర్లు ఆ దిశగా ఆలోచిస్తారా? ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత దీనిపై ఓ అంచనాకు రావొచ్చేమో. ఇక విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశంపై శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యలను సమర్థించిన మాజీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వసీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటేశాడు. ‘గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తాడు. కాబట్టి టెస్టుల్లో అతన్ని నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  దించాలి. బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనర్లుగా రాణించారు. వాళ్లను అలాగే కొనసాగించాలి. దాన్ని మార్చకుండా మూడో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తే సరిపోతుంది. గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరిగ్గా సరిపోతాడు’ అని జాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరించాడు. 

కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎవరు?

నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాసేపు పక్కనబెడితే కెప్టెన్సీ విషయంలోనూ చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారసుడిగా గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు బయటకు వస్తున్నా... టెస్టు తుది జట్టులో అతను రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యే చాన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా తక్కువ అని మాజీలు చెబుతున్నారు. కెప్టెన్సీ భారాన్ని గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మోపడం వల్ల బ్యాటింగ్ దెబ్బతింటుందని అంచనా వేస్తున్నారు.

‘టెస్టు లైనప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యారెంటీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదు. బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వాలి. ఒకవేళ తను ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లేకపోయినా, అందుబాటులో ఉండకపోయినా రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకరికి చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తే సరిపోతుంది’ అని క్రిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు.  ఇండియాలో ప్రతిభకు కొదువలేదని, విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఎవరు? అన్న ప్రశ్నకు ఆందోళనే అవసరం లేదని సౌతాఫ్రికా మాజీ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటున్నాడు. 

‘సచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకముందు అలాంటి ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

వస్తాడని ఎవరైనా ఊహించారా? కోహ్లీకి ముందు కూడా అలాగే జరిగింది కదా? ఇప్పుడు కూడా అంతే’ అని బౌచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు