
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పరిస్థితులను బీజేపీ సర్కార్ పూర్తిగా దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ మండిపడ్డారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్‌కు అప్రూవల్ ఇవ్వడంపై ఆయన సీరియస్ అయ్యారు. టీకా విశ్వసనీయతపై తలెత్తుతున్న ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘బీజేపీ ప్రభుత్వం కరోనా మహమ్మారి పరిస్థితులను పూర్తిగా దుర్వినియోగం చేసింది. టీకా విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోబోయే వారికీ ప్రశ్నలు వస్తున్నాయి. టీకా అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసిన కంపెనీకి ప్రభుత్వం ద్రోహం చేసినట్లే. కొత్తగా తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ కోసం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాని వ్యాక్సిన్‌కు హడావుడిగా కేంద్రం లైసెన్స్ ఇవ్వడం దారుణం’ అని తివారీ వ్యాఖ్యానించారు.