ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో హై ఓల్టేజ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌..బోణీ ఎవరిదో?

ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో హై ఓల్టేజ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌..బోణీ ఎవరిదో?

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ : తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఓడిన సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో మరో కీలక పోరుకు రెడీ అయ్యింది. బుధవారం ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో జరిగే హై ఓల్టేజ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బలమైన ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది.  తొలి మ్యాచ్​లో  మయాంక్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌, అభిషేక్‌‌‌‌‌‌‌‌ శర్మ, క్లాసెన్‌‌‌‌‌‌‌‌ దంచికొట్టినా మిగతా వారు సరైన సహకారం అందించలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సమష్టిగా రాణించాలని రైజర్స్‌‌‌‌‌‌‌‌ లక్ష్యంగా పెట్టుకుంది.

పించ్‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌గా అబ్దుల్‌‌‌‌‌‌‌‌ సమద్‌‌‌‌‌‌‌‌ వైఫల్యం, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో లేకపోవడం ఆందోళనకరంగా మారింది. మరోవైపు ఐదుసార్లు చాంపియన్‌‌‌‌‌‌‌‌ ముంబై.. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడింది. దీంతో కనీసం ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనైనా గెలిచి పాయింట్ల బోణీ చేయాలని హార్దిక్‌‌‌‌‌‌‌‌ సేన బలంగా కోరుకుంటున్నది.

బుమ్రా బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకున్నా, డేవ్లాడ్ బ్రేవిస్‌‌‌‌‌‌‌‌, రోహిత్‌‌‌‌‌‌‌‌ ధాటిగా ఆడినా లోయర్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ వైఫల్యంతో ముంబై ఓటమి పాలైంది. ఇప్పుడు తప్పులను సరిదిద్దుకుని బోణీ చేయాలని ముంబై పట్టుదలగా కనిపిస్తున్నది.