తొలి మ్యాచ్‌‌‌‌లో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌ అమీతుమీ

తొలి మ్యాచ్‌‌‌‌లో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌ అమీతుమీ
  • ఆసియా హీరోలెవరో?
  • నేటి నుంచి ఆసియా కప్‌
  • తొలి మ్యాచ్‌‌‌‌లో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌ అమీతుమీ
  • రా.7.30 నుంచి స్టార్​ స్పోర్ట్స్​లో
  • రేపు ఇండో ‑ పాక్‌‌ మ్యాచ్‌‌


దుబాయ్‌‌‌‌:  ఓవైపు కరోనా పాండమిక్‌‌.. మరోవైపు ఆతిథ్య శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. ఇక జరుగుతుందా? లేదా? అన్న సందేహాల మధ్య ఎట్టకేలకు ప్రతిష్టాత్మక ఆసియా కప్‌‌ టోర్నీకి రంగం సిద్ధమైంది. దాదాపు ఆరేళ్ల తర్వాత యూఏఈలో ఈ మెగా టోర్నీ జరుగుతుండటంతో.. వరల్డ్‌‌ క్రికెట్‌‌ మొత్తం దీనిపై దృష్టిసారించింది. శనివారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో  ఆధిపత్యం కోసం ఆరు జట్లు తమ బలబలాలను ప్రదర్శించేందుకు రెడీ అయ్యాయి. ఏకైక క్వాలిఫయర్‌‌ హాంకాంగ్‌‌ను పక్కనబెడితే.. రికార్డు స్థాయిలో ఏడుసార్లు చాంపియన్‌‌గా నిలిచిన ఇండియాతో పాటు పాకిస్తాన్‌‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌‌, అఫ్గానిస్తాన్‌‌.. తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా ఓడిస్తాయి. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌‌లో జరుగుతున్నది కాబట్టి విజయాలను అంచనా వేయడం కష్టం. 

ఫేవరెట్‌‌గా ఇండియా 

డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఈసారి టోర్నీలో ఫేవరెట్‌‌గా కనిపిస్తున్నది. అయితే పాకిస్తాన్‌‌, బంగ్లాదేశ్‌‌ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. శనివారం జరిగే తొలి పోరులో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌తో పోటీపడుతుంది. ఇక ఆదివారం జరిగే ఇండో–పాక్‌‌ పోరుతో ఆట ఓ రేంజ్‌‌కు వెళ్లనుంది. మిగతా జట్లు చూడటానికి చిన్నవే అయినా పోరాట స్ఫూర్తి కలిగి ఉన్నాయి. ఇండో–పాక్‌‌ మ్యాచ్‌‌లో అందరి దృష్టి మాజీ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీపైనే ఉంది. ఫామ్‌‌లేమితో ఇబ్బందిపడిన కింగ్‌‌ కోహ్లీ.. ఈ టోర్నీలో తన సత్తా ఏంటో చూపెడతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో రెండు నెలలో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌‌కప్‌‌ ఉన్న నేపథ్యంలో కెప్టెన్‌‌ రోహిత్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌ కూడా టోర్నీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే స్టార్‌‌ పేసర్‌‌ బుమ్రా లేకపోవడం ఇండియాకు  ప్రతికూలంగా మారింది. గత ఏడాది కాలంలో బాగా ఆడుతున్న పాక్‌‌ కూడా.. 10 ఏళ్ల క్రితం వన్డే ఫార్మాట్‌‌లో గెలిచిన ట్రోఫీని మరోసారి రిపీట్‌‌ చేయాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. మోకాలి గాయంతో స్టార్‌‌ పేసర్‌‌ ఆఫ్రిది లేకపోవడం వాళ్లకు లోటు. బ్యాటింగ్‌‌లో బాబర్‌‌, రిజ్వాన్‌‌పైనే ఎక్కువ భారం ఉంది. 

ట్రంప్‌‌ కార్డు రషీద్‌‌..

అఫ్గానిస్తాన్‌‌ టీమ్‌‌లో ట్రంప్‌‌ కార్డు మాత్రం స్పిన్నర్‌‌ రషీద్‌‌ ఖానే. ఎలాంటి బ్యాటర్‌‌నైనా బోల్తా కొట్టించే సామర్థ్యం అతని సొంతం. ఎక్స్‌‌పీరియెన్స్‌‌ మహ్మద్‌‌ నబీ నేతృత్వంలోని అఫ్గానిస్తాన్‌‌ కూడా మెరుగైన పెర్ఫామెన్స్‌‌ చేసేందుకు రెడీగా ఉంది. పెద్ద ప్రత్యర్థులపై సంచలన విజయాలు సాధించాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. కొత్త కోచ్‌‌ క్రిస్‌‌ సిల్వర్‌‌వుడ్‌‌ నేతృత్వంలో శ్రీలంక కూడా ట్రోఫీపై కన్నేసింది. టీమ్‌‌లో నైపుణ్యానికి కొదువలేదు. అనామక ప్లేయర్లు కూడా సింగిల్‌‌ నైట్‌‌లో స్టార్లుగా ఎదగడానికి ఈ టోర్నీ అవకాశంగా ఉండటంతో ప్రతి ప్లేయర్‌‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. షకీబ్‌‌, టెక్నికల్‌‌ డైరెక్టర్‌‌ శ్రీధరన్‌‌ శ్రీరామ్‌‌ పర్యవేక్షణలో బంగ్లాదేశ్‌‌ కూడా ప్రమాదకరంగానే కనిపిస్తున్నది. ఒమన్‌‌లో జరిగిన క్వాలిఫయర్స్‌‌లో యూఏఈని ఓడించి హాంకాంగ్‌‌ నాలుగోసారి ఆసియా కప్‌‌కు క్వాలిఫై అయ్యింది. 

ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌ ఇది..

మొత్తం ఆరుజట్లను రెండు గ్రూప్‌‌‌‌లు విభజించారు. గ్రూప్‌‌‌‌–ఎలో ఇండియా, పాకిస్తాన్‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌,  గ్రూప్‌‌‌‌–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌ ఉన్నాయి. లీగ్‌‌‌‌ దశలో ప్రతి గ్రూప్‌‌‌‌లో టాప్‌‌‌‌–2లో నిలిచిన జట్లు సూపర్‌‌‌‌–4కు అర్హత సాధిస్తాయి. ఇందులో టాప్‌‌‌‌–2లో నిలిచిన టీమ్స్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌ ఆడతాయి. మ్యాచ్‌‌‌‌లన్నీ దుబాయ్‌‌‌‌, షార్జాలో జరగనున్నాయి. 


షెడ్యూల్‌‌‌‌ తేదీ  మ్యాచ్‌‌    వేదిక

27    అఫ్గానిస్తాన్‌‌ x శ్రీలంక    దుబాయ్​
28    ఇండియా x పాకిస్తాన్‌‌    దుబాయ్
30    అఫ్గానిస్తాన్‌‌ x బంగ్లాదేశ్‌‌    షార్జా
31    ఇండియా x హాంకాంగ్‌‌    దుబాయ్
1    బంగ్లాదేశ్‌‌ x శ్రీలంక    దుబాయ్
2    పాకిస్తాన్‌‌ x హాంకాంగ్‌‌    షార్జా
3‑9    సూపర్‌‌‑4 మ్యాచ్‌‌లు    దుబాయ్​
11    ఫైనల్‌‌    దుబాయ్

అన్ని మ్యాచ్‌‌లు రా. 7.30 నుంచి