
క్రికెట్ లో గొప్ప ఇన్నింగ్స్ లు ఎవరైనా ఆడగలరు. కానీ మూడు ఫార్మాట్ లలో బెస్ట్ క్రికెట్ ఆడడం చాలా కొద్ది మందికే సాధ్యం. ప్రస్తుత జనరేషన్ లో మూడు ఫార్మాట్లు ఆడే ప్లేయర్స్ వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. గత జనరేషన్ లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, రూట్, విలియంసన్, బాబర్ అజామ్ లాంటి ప్లేయర్లు ప్రతి ఫార్మాట్ లో నిలకడగా రాణించేవారు. వీరి శకం ముగియడంతో ఇప్పుడున్నా క్రికెట్ లో మూడు ఫార్మాట్ లు ఎవరు ఆడతారనే చర్చ నడిచింది. ఇటీవలే టీమిండియాతో తొలి టెస్ట్ ముగిసిన తర్వాత బెన్ డకెట్ ను ఆల్ టైం బెస్ట్ ప్లేయర్ గా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అన్నాడు.
ALSO READ | Pakistan Cricket Board: 8 నెలలకే మార్చేశారు.. పాకిస్థాన్ టెస్ట్ జట్టుకు కొత్త కోచ్
లీడ్స్ వేదికగా ఇండియాతో జరిగిన తొలి టెస్టులో డకెట్ రెండు ఇన్నింగ్స్ ల్లో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 62 పరుగులు చేసిన ఈ ఇంగ్లీష్ ఓపెనర్ రెండో ఇన్నింగ్స్ లో 149 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. ఈ ఇంగ్లీష్ ఓపెనర్ ఆటకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. డకెట్ పరిమిత ఓవర్ల క్రికెట్ లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. దీంతో వాన్ తమ ఆటగాడు అన్ని ఫార్మాట్ లు అడగలిగే బెస్ట్ ప్లేయర్ అని కితాబులిచ్చాడు. అయితే వాన్ ఎంపిక టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రాకు నచ్చలేదు. డకెట్ కంటే ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ అన్ని ఫార్మాట్లలో గొప్ప ఆటగాడు అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
చోప్రా మాట్లాడుతూ.. "డకెట్ మంచి ప్లేయర్ అని నేను అంగీకరిస్తున్నాను. అయితే డకెట్ గంటె గొప్ప ప్లేయర్లు ఉన్నారు. డకెట్ ఇంకా ఇండియా, ఆస్ట్రేలియాలో పరుగులు చేయలేదు. అతని కంటే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ప్రస్తుత ఆటగాళ్లలో బెస్ట్ బ్యాటర్. అతను ఫార్మాట్ ఏదైనా ప్రత్యేకంగా నిలుస్తాడు. గత రెండు సంవత్సరాలుగా అతని గణాంకాలను పరిశీలిస్తే.. మూడు ఫార్మాట్లలో చాలా అద్భుతంగా ఉన్నాయి.
హెడ్ కు పెద్ద మ్యాచ్లలో నిలబడే నేర్పు ఉంది. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అతని అత్యుత్తమ ప్రదర్శనకు నిదర్శనలు. నా అభిప్రాయం ప్రకారం ట్రావిస్ హెడ్.. డకెట్ కంటే ముందున్నాడు. టీమిండియా యువ బ్యాటర్ జైస్వాల్ కు మూడు ఫార్మాట్లలో ఆడే సామర్థ్యం ఉన్నా అతనికి వన్డేల్లో ఇంకా చోటు దక్కలేదు. టీ20ల్లో ఆడే అవకాశం రావడం లేదు". అని చోప్రా తన అభిప్రాయాన్ని తెలిపాడు. హ్యారీ బ్రూక్, శుభమాన్ గిల్, రికెల్ టన్ లాంటి యువ ప్లేయర్లు సైతం మూడు ఫార్మాట్ లలో మంచి పేరు తెచ్చుకున్నారు.