దేశ వ్యతిరేకులను ఎన్ కౌంటర్ చేసేస్తాం

దేశ వ్యతిరేకులను ఎన్ కౌంటర్ చేసేస్తాం

లక్నో: ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీద ప్రముఖ ఉర్దూ రచయిత మున్నావర్ రాణా చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచి తిరిగి ఆదిత్యనాథ్ సీఎం పీఠాన్ని అధిష్టిస్తే యూపీ వదిలేసి వెళ్తానని రాణా అన్నారు. వ్యాఖ్యలపై దుమారం రేపుతున్నాయి.
రాణా కామెంట్ల మీద యూపీ రాష్ట్ర మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా సీరియస్ అయ్యారు. భారతీయతకు వ్యతిరేకంగా ఉన్న రాణా లాంటి వ్యక్తులు యూపీని, దేశాన్ని విడిచి వెళ్లాలని హెచ్చరించారు. 1947లో దేశ విభజన తర్వాత రాణా లాంటి కొందరు భారత్ లో ఉండిపోయారని స్వరూప్ చెప్పారు. ఇలాంటి వ్యక్తులు దేశాన్ని లోపలి నుంచి విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దేశ వ్యతిరేకులకు ఇక్కడ చోటు లేదన్న స్వరూప్.. అలాంటి వాళ్ల ఎవరైనా ఉంటే ఎన్ కౌంటర్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.