ఫ్యుయల్ ప్రొడక్షన్ తగ్గడం వల్లే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయ్

ఫ్యుయల్ ప్రొడక్షన్ తగ్గడం వల్లే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయ్

న్యూఢిల్లీ: రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఫ్యుయల్ ధరలు సెంచరీ మార్క్‌ను దాటగా.. ఇంకొన్ని స్టేట్స్‌‌లో రూ.90 పైచిలుకుగా ఉన్నాయి. పెట్రో ధరలు పెరుగుతుండటంపై విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీని మీద పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.

ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌‌పోర్టింగ్ కంట్రీస్‌‌ (ఓపెక్‌‌)లో భారత్ సభ్య దేశంగా ఉందని, ఈ కంట్రీస్ ప్రొడక్షన్‌‌ను తగ్గించకూడదని నిబంధనలు ఉన్నాయిని ప్రధాన్ తెలిపారు. అయితే అవి ఉత్పత్తిని తగ్గిస్తుండటంతో ఆ ప్రభావం మన దేశంలో ఫ్యుయల్ రేట్లపై చూపిస్తోందన్నారు. ‘ఫ్యుయల్ రేట్ల పెరుగుదలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌‌లో ఫ్యుయల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దేశాలు కూడా ఎక్కువ లాభాలు ఆర్జించడం ధ్యేయంగా ఫ్యుయల్‌ను తక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయి. దీని వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగిత దేశాలపై పెను భారం పడుతోంది’ అని ప్రధాన్ స్పష్టం చేశారు.