wolves attack:వాటికి ఏమైందీ..జనంపై తోడేళ్ల దాడులు ఎందుకు..? : 30 ఏళ్ల తర్వాత అలజడి

wolves attack:వాటికి ఏమైందీ..జనంపై తోడేళ్ల దాడులు ఎందుకు..? : 30 ఏళ్ల తర్వాత అలజడి

దాదాపు 30యేళ్ల తర్వాత మళ్లీ తోడేళ్ల దాడులు..అర్థరాత్రి గ్రామాలపైపడి చిన్న పిల్లలను చంపేస్తున్నాయి.1997 తర్వాత మళ్లీ యూపీలో తోడేళ్ల విజృంభన..గత కొన్ని వారాలుగా దాదాపు ఏడుగురు పిల్లలను చంపేశాయి. ముప్పై ఏళ్ల నాటి పరిస్థితిని గుర్తు చేశాయి.. అసలు తోడేళ్లు  మళ్లీ ఎందుకు రెచ్చిపోతున్నాయి. యూపీలో బహ్రై చ్ లో జిల్లాలో తోడేళ్ల గుంపు ఎందుకు గ్రామాలపై దాడులు అంతుబట్టని విషయం. అయితే దీనిపై  పర్యావరణ శాస్త్రవేత్తలు తోడేళ్ల దాడులపై ఆసక్తికర, కీలక విష యాలను వెల్లడించారు. 

ఆగస్టు 2024 లో యూపీలోని బహ్రైచ్ జిల్లాలో గ్రామాలపై పడి తోడేళ్ల గుంపు చిన్నారులే టార్గెట్ గా దాడులు చేస్తున్నాయి. వారాల వ్యవధిలోనే ఏడుగురు పిల్లలను చంపేశాయి. ఆకలితో ఉన్న తోడేళ్ల సమూహం అర్థరాత్రి గ్రామాలపై ఇండ్లలో, ఆరుబయట నివసిస్తున్న చిన్నారులను ఈడ్చుకెళ్లి చంపేస్తున్నాయి. 1997 ఇలాంటి దాడులు యూపీలో జరిగాయి.. ముప్పైఏళ్ల తర్వాత  బహ్రైచ్ జిల్లాలో తోడేళ్లు దాడులు జరగడంతో ప్రజలు భయాందోళనతో జీవిస్తున్నారు. 

అయితే తోడేళ్లు గుంపులు గుంపులుగా గ్రామాలపై పడటం ఏంటీ..? చిన్నారులనే టార్గెట్ చేసి ఎత్తుకెళ్లడం, చంపడమేంటీ.. ? ముప్పై ఏళ్ల తర్వాత ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి.. కేవలం వారాల వ్యవధిలోనే ఏడుగురు చిన్నారులను చంపడంతో.. ఇలాంటి సందేహాలు తలెత్తుతున్న క్రమంలో.. ఆకస్మాత్తుగా తోడేళ్ల ప్రవర్తనలో ఈ మార్పులకు గల కారణాలను విశ్లేషించేదుకు ప్రయత్నం చేశారు. 

సీనియర్ వన్యప్రాణి శాస్త్రవేత్త, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(WII) మాజీ డీన్ అయిన డాక్టర్ వైవీ ఝాలా .. తోడేళ్ల ఈ ఆకస్మిక ప్రవర్తన మార్పులను గురించి ఇలా చెప్పారు. ‘‘ ఇ ది చాలా అరుదు.. సహజంగా   తోడేళ్లు ఎప్పుడూ మనుషులపై దాడులు  చేయవు.. 1980లో ఒకసారి, 1997లో చివరి సారిగా గ్రామాలపై పడి తోడేళ్లు మనుషులపై దాడులు చేయడం చూశాం.. ఇది రెండు సంఘటనలు యూపీ, బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో జరిగాయి. 

ఇప్పుడు 30 యేళ్ల తర్వాత మరోసారి జరిగింది. ఇక్కడి ప్రజలు ఇప్పటికి ఇళ్లకు ఎటువంటి తలుపులు లేకుండా అత్యంత పేదరికంలో జీవిస్తున్నారు. అయితే ఆకలితో ఉన్న తోడేళ్లకు ఇది అవకాశం కావచ్చని డాక్టర్ వైవీ ఝాలా అన్నారు. 

దీంతోపాటు దేశంలో పచ్చిక బయళ్లలో నివసించే మాంసాహారులైన తోడేళ్లకు.. గొర్రెలు మేకలు, జింకలు, చింకారా, పాములు వంటివి ఆహారంగా తీసుకుంటాయి. అయితే గడ్డి భూములు కనుమరుగవుతున్నందన వారి వీటి జనాభాలో చాలా అటవీ ప్రాంతాలను వదిలి వెలుపల జీవిస్తున్నాయి. ఇలాంటి జీవులన్నీ మనుషుల అధీనంలో ఉన్నాయి. 

దీంతో తోడేళ్లకు ఆహారం కొరత కారణంగా .. ఆహార వేటలో గుంపులుగా గ్రామాలపై  పడటానికి ఒకకారణంగా   శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  
ఆహారం దొరకనప్పుడు గ్రామాల్లో చిన్ని పిల్లలపై అటాక్ చేస్తుంటాయి.  పిల్లలైతే  సులభంగా ఎరగా మారుతారు కాబట్టి.. ఒకసారి వేటాడిన తోడేళ్లు.. మళ్లీ మళ్లీ దాడి చేసేందుకు మొగ్గు చూపుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

అయితే తోడేళ్ల దాడులను నివారణపై పలువురు నిపుణులు , శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు చేస్తున్నారు. గ్రామీణ జీవనోపాధిని మెరుగు పర్చడం, ప్రజలకు కనీస సౌకర్యాలు విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు వంటి కల్పించడం ద్వారా పిల్లలపై తోడేళ్ల దాడులను నివారించవచ్చని అంటున్నారు. ఇంకోఅ డుగు ముందుకు వేసి.. నిద్ర పోయే సమయంలో పిల్లలను ఓ తాడుతో కట్టి.. మీ చేతిలో కట్టుకోండి.. తోడేళ్లు దాడి చేసి ఈడ్చుకెళ్తున్నపుడు వెంబడించి కాపాడుకునే అవకాశం ఉంటుందం టున్నారు. 

వరసగా వారాల వ్యవధిలోనే  తోడేళ్ల దాడుల్లో ఏడుగురు చిన్నారులు చనిపోవడంతో యూపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం యోగి ఆదిత్యానాధ్.. తోడేళ్ల నుంచి రక్షణకు చర్యలు చేపట్టారు. చిన్నారుల మరణాలను సీరియస్ గా తీసుకున్న యూపీ సీఎం..తోడేళ్లు కనిపిస్తే కాల్చి చంపేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు.