సూర్యకుమార్‌కు డబుల్ షాక్.. కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ.. అసలు కారణం ఇదే?

సూర్యకుమార్‌కు డబుల్ షాక్.. కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ.. అసలు కారణం ఇదే?

Suryakumar Yadav: భారత టీ20 క్రికెట్‌లో సెలక్షన్ కమిటీ ఒక్కసారిగా పెద్ద బాంబ్ పేల్చింది. మొన్నటిదాకా జట్టును నడిపించిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ గట్టి షాక్ ఇచ్చింది. ఆయనను కేవలం టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. ఏకంగా జట్టు నుంచే టోటల్‌గా అతడ్ని పక్కనబెట్టేసి డబుల్ షాక్ ఇచ్చింది. అతడి ప్లేస్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ లీడర్ శ్రేయస్ అయ్యర్‌ను భారత కొత్త టీ20 కెప్టెన్‌గా సెలక్టర్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

వరల్డ్ కప్ గెలిపించినా నో ఛాన్స్: 
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ అదిరిపోయే రేంజ్‌లో టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకుంది. అయినా సరే బోర్డు ఆయనపై ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. కెప్టెన్సీ పరంగా సూర్య సక్సెస్ అయినా, గత కొంతకాలంగా ఆయన బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ 2026 సీజన్ల ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్య.. 13 మ్యాచ్‌ల్లో కేవలం 20.76 యావరేజ్‌తో 270 రన్స్ మాత్రమే చేసిండు. ఆఖరికి ముంబై టీ20 లీగ్‌లోనూ ఒక్కటంటే ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు.

ఒలింపిక్స్ టార్గెట్: 
రాబోయే 2028 టీ20 వరల్డ్ కప్, అట్లనే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ రీ-ఎంట్రీ ఇస్తుండటంతో.. లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం ఒక స్ట్రాంగ్ యంగ్ టీమ్‌ను బిల్డ్ చేయాలని భారత సెలక్టర్లు ఫిక్స్ అయ్యారు. 36 ఏళ్ల సూర్యకు ఇంకో ఛాన్స్ ఇచ్చే కంటే, కొత్త లీడర్‌ను రెడీ చేయడమే కరెక్ట్ అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్‌ ఎందుకు?: 
శ్రేయస్ అయ్యర్ డిసెంబర్ 2023 తర్వాత ఇండియా తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు.. కానీ, ఐపీఎల్‌లో ఆయనకు ఉన్న మైండ్ బ్లోయింగ్ కెప్టెన్సీ రికార్డే ఈ బాధ్యతలను తెచ్చిపెట్టింది. ఐపీఎల్‌లో వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్స్‌కు తీసుకెళ్లిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ లీడర్ కావడంతో.. టీమిండియా నెక్స్ట్ ఫేజ్‌ను లీడ్ చేయడానికి శ్రేయస్ అయ్యరే పక్కా కరెక్ట్ సారథి అని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నమ్మింది. కాగా జూన్ 26 నుంచి షురువయ్యే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లతో పాటు జపాన్ వేదికగా జరిగే 2026 ఆసియా క్రీడల్లో (Asian Games) కూడా శ్రేయస్ అయ్యరే మన జట్టును నడిపించబోతున్నాడు. 

ALSO READ : 15 ఏళ్ల వయసులోనే సచిన్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్..

మన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు ప్రమోషన్: 
ఈ సరికొత్త టీ20 టీమ్‌లో మన తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. మన హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మను టీమిండియా టీ20 జట్టుకు అఫీషియల్ వైస్ కెప్టెన్‌గా సెలక్ట్ చేశారు. భవిష్యత్తు లీడర్‌షిప్ ప్లాన్స్‌లో భాగంగా తిలక్‌కు ఈ ప్రమోషన్ దక్కింది. ఆయనతో పాటు వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. ఇక ఈ స్క్వాడ్  లోకి 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ.. చిన్న వయసులోనే ఆయన ఏకంగా మూడు మెయిన్ స్క్వాడ్స్ (ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆసియా క్రీడలు) లోనూ చోటు సంపాదించుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.