Team India captaincy: భారత టీ20 క్రికెట్‌లో బీసీసీఐ (BCCI) ఈరోజు (శనివారం, జూన్ 6న) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారింది. టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించడమే కాకుండా.. ఏకంగా జట్టు నుంచే టోటల్‌గా పక్కనబెట్టేసి సెలక్టర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఆయన ప్లేస్‌లో ముంబైకే చెందిన శ్రేయస్ అయ్యర్‌ను ఇండియా కొత్త టీ20 కెప్టెన్‌గా బీసీసీఐ అనౌన్స్ చేయడంతో.. నెట్టింట జనాలు ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియా కెప్టెన్సీ ఏమైనా ముంబై వాసుల కోటానా? అంటూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు.
రోహిత్, సూర్య, ఇప్పుడు శ్రేయస్:
నెటిజన్లు ట్విట్టర్ (X), ఫేస్‌బుక్, ఇంస్టాగ్రామ్ లలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరుపై గట్టిగనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా భారత టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు మొత్తం ముంబై ప్లేయర్ల చుట్టూనే తిరుగుతోంది. ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లీ తర్వాత జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ 2024లో కరీబియన్ వేదికగా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ముంబై వాళ్లకే కెప్టెన్సీ ఇస్తారా:
రోహిత్ శర్మ తర్వాత ముంబైకే చెందిన మరో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు సూర్యను పీకేసి మళ్లీ ముంబై వాసుడైనా శ్రేయస్ అయ్యర్‌నే ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. వరుసగా మూడోసారి కూడా ముంబై ఆటగాళ్లకే సారథ్య బాధ్యతలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టీమిండియాను నడిపించడానికి వేరే రాష్ట్రాల ప్లేయర్లు ఎవరూ కనిపిస్తలేరా?.. కేవలం ముంబై బ్యాక్‌గ్రౌండ్ ఉందనే కెప్టెన్సీ పగ్గాలు ఇస్తున్నారా? అంటూ నెటిజన్లు స్ట్రైట్ క్వశ్చన్స్ వేస్తున్నారు.
ALSO READ : సూర్యకుమార్‌కు డబుల్ షాక్..
తిలక్ వర్మకి కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్:
మన తెలుగు పొరగాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా ప్రకటించడం హ్యాపీనే అయినా.. ఆయన్నే డైరెక్ట్‌గా కెప్టెన్‌ను చేయొచ్చు కదా అని తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు అడుగుతున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లతో పాటు 2026 ఆసియా క్రీడల్లో (Asian Games) కూడా శ్రేయస్ అయ్యరే కెప్టెన్‌గా ఉండబోతున్నాడు. అలాంటప్పుడు తిలక్ వర్మ వంటి యంగ్ ప్లేయర్‌ను ఫుల్ టైమ్ కెప్టెన్ చేసి, ఫ్యూచర్ లీడర్‌గా రెడీ చేయకుండా మళ్లీ ముంబై ప్లేయర్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపడం ఏంటి అని నెట్టింట లొల్లి చేస్తున్నారు. మొత్తానికి బీసీసీఐ తీసుకున్న ఈ డెసిషన్ క్రికెట్ వర్గాల్లో పెద్ద రచ్చకే దారితీసింది.
