మర్పల్లిలో విషాదం.. భోజనం చేస్తున్న నలుగురిపై కూలిన హోటల్ స్లాబ్

మర్పల్లిలో విషాదం.. భోజనం చేస్తున్న నలుగురిపై కూలిన హోటల్ స్లాబ్

వికారాబాద్: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో శిథిలావస్థలో ఉన్న స్లాబ్ కూలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మర్పల్లిలో ఓ హోటల్ స్లాబ్ అకస్మాత్తుగా కుప్పకూలింది. హోటల్ లోపల ముగ్గురు  వ్యక్తులు ఒక 17 సంవత్సరాల అమ్మాయి భోజనం చేస్తుండగా స్లాబ్ అకస్మాత్తుగా కూలింది.

కూలిన స్లాబ్ను తొలగించడానికి.. స్లాబ్ కింద ఉన్న వారిని జెసీబీతో బయటికి తీయడానికి అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. హోటల్ లోపల నుంచి నలుగురిని పోలీసులు బయటకు తీశారు. గాయపడ్డవారిని సంగారెడ్డి ప్రభుత్వ  హాస్పిటల్కి తరలించారు. 

ఘటనా స్థలాన్ని వికారాబాద్ డీఎస్పీ సీ అంజయ్య పరిశీలించారు. స్లాబ్ కూలిన ఘటనపై మర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : మేడ్చల్ ఓఆర్ఆర్‎పై ఘోర రోడ్డు ప్రమాదం..