ఇది టీమిండియానా.. గుజరాత్ టీమా..? భారత టెస్ట్ జట్టుపై సోషల్ మీడియాలో ట్రోల్స్

ఇది టీమిండియానా.. గుజరాత్ టీమా..? భారత టెస్ట్ జట్టుపై సోషల్ మీడియాలో ట్రోల్స్

IND vs AFG: న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ లొ ఇవాళ్టి (2026, జూన్ 6) నుంచి షురువైన ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఒక కొత్త రచ్చకు తెరలేపింది. ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన ఐదు రోజులకే టీమిండియా ఈ మ్యాచ్ ఆడుతుండగా.. ఈరోజు బరిలోకి దిగిన ఇండియా తుది జట్టు (Playing XI) లో ఐపీఎల్ రన్నరప్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ప్లేయర్స్ ఎక్కువ మంది ఉండటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

ఇది టీమిండియానా.. గుజరాత్ టీమా..?

నిజానికి ఇండియా ప్రకటించిన 15 మంది స్క్వాడ్‌లోనే ఏకంగా ఏడుగురు (7) గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు సెలక్ట్ అయ్యారు. ఇక ఇవాళ మ్యాచ్‌లొ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. గ్రౌండ్‌లోకి దింపిన తుది జట్టులో ఏకంగా ఆరుగురు జీటీ ప్లేయర్లకే ఛాన్స్ ఇవ్వడంతో "ఇది మన భారత జట్టా? లేకపోతే గుజరాత్ టైటాన్స్ టీమా భాయ్?" అంటూ నెటిజన్లు ట్విట్టర్ (X) లొ మీమ్స్ ని వైరల్ చేస్తున్నారు. 

ఐపీఎల్ హ్యాంగోవర్.. అసిస్టెంట్ కోచ్ ఏమన్నాడంటే?: 
రాత్రి పూట టీ20 క్రికెట్ ఆడే అలవాటైన ప్లేయర్లను.. పొద్దుగాలనే 34 నుంచి 35 డిగ్రీల మస్తు ఎండలో ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ఆడించడం పెద్ద తిప్పలే అని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ అన్నాడు. ఐపీఎల్ టైమ్ సైకిల్ వేరు, టెస్ట్ మ్యాచ్ టైమ్ సైకిల్ వేరు.. అందుకే ప్లేయర్ల స్లీప్ సైకిల్ (Sleep Cycles) ఖరాబ్ అవ్వకుండా మార్చడంపై మేం ప్రధానంగా ఫోకస్ పెట్టినాం.. పొద్దుగాలనే జిమ్ సెషన్స్ పెట్టి, పొరగాళ్లని జల్దీ నిద్ర లేచేటట్టు ప్లాన్ చేసినాం.. వైట్ బాల్ అలవాట్లను పక్కనబెట్టి, రెడ్ బాల్‌తో 'ప్రాపర్ టెస్ట్ క్రికెట్' ఆడేలా వాళ్లను సిద్ధం చేశామని కోచ్ చెప్పాడు.

నంబర్ 3 పొజిషన్.. స్పిన్నర్ల పోటీ: 
ఐపీఎల్‌లో అదరగొట్టిన సాయి సుదర్శన్ టీమిండియాలో నంబర్ 3 బ్యాటింగ్ పొజిషన్ లో బరిలోకి దిగబోతున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. కుల్దీప్ యాదవ్‌తో పాటు యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌ ఈ మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం (Debut) చేసిండు. ఇంకోవైపు గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం మస్త్ ఫిట్‌గా బౌలింగ్‌ను నడిపించనున్నాడు.  

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్?: 
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిలే ఇప్పుడు భారత జట్టుకు కూడా సారథిగా కొనసాగుతున్నాడు. దీంతో ఆయన తన ఐపీఎల్ టీమ్ ప్లేయర్లకే తుది జట్టులో ఎక్కువ అవకాశం ఇచ్చాడనే టాక్ నడుస్తుంది. డొమెస్టిక్ క్రికెట్‌లో ఎప్పటినుంచో రాణిస్తున్న వారిని కాదని కేవలం గుజరాత్ జట్టులోని ప్లేయర్లను తీసుకోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ గిల్‌ను నిలదీస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్‌కు శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తో, మ్యాచ్ గెలిపించి ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో చూడాలి. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టులోని ఆటగాళ్లు: సాయి సుదర్శన్, శుభమాన్ గిల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ..