గడచిన వారం రోజుల నుంచి వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి రేట్లు రిటైల్ కొనుగోలుదారులకు భారీ ఊరటగా నిలుస్తున్నాయి. నిన్నటి వరకూ కొద్దికొద్దిగా తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్ వారాంతంలో భారీ తగ్గుదలను నమోదు చేయటంతో తెలుగు ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీంతో వీకెండ్ షాపింగ్ చేయాలని భావిస్తున్న వారు ముందుగా తమ నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
జూన్ 6న బంగారం రేట్లు తగ్గాయి. జూన్ 5 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.300 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 273గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేలుగా కొనసాగుతోంది.
ALSO READ : ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 6, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.10వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.10వేలు తగ్గి రూ.2లక్షల 70వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.270 దగ్గర ఉంది.
