వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. క్షణికావేశంలో చేస్తున్న తప్పులు కన్న బిడ్డలను తల్లిదండ్రులకు దూరం చేసి.. అనాథలుగా మారుస్తున్నాయి. తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఆమె పేరు అక్షయ. భర్త పేరు ధర్మరాజ. ఈ భార్యాభర్తకు ఐదేళ్ల వయసు ఉన్న కొడుకు కూడా ఉన్నాడు.
Shocking Domestic Violence Case in #Pattukkottai #Thanjavur District #TamilNadu
— Siraj Noorani (@sirajnoorani) June 5, 2026
A married woman named Akshaya was allegedly caught by her husband Dharmaraja having sex with salon worker Joshua. In a fit of rage, Dharmaraja attacked his wife, tried to slit her throat, and… pic.twitter.com/aXUPzYlPDs
పెళ్లయిన కొన్నేళ్లు ఈ భార్యాభర్త అన్యోన్యంగానే ఉన్నారు. కడుపున పుట్టిన పిల్లాడిని కూడా ప్రేమగానే చూసుకున్నారు. కానీ.. ఆమెకు మరో మనిషితో ఏర్పడిన పరిచయం కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. పచ్చని సంసారంలో చేజేతులా నిప్పులు పోసుకున్నట్లయింది. సెలూన్ వర్కర్గా పనిచేస్తున్న జోషువాతో అక్షయకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఇటీవల.. ఈ ఇద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా అక్షయ భర్త ధర్మరాజకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. భార్యను మరొకరితో అలా చూసేసరికి ధర్మరాజ కోపంతో రగిలిపోయాడు. క్షణికావేశంలో కన్న కొడుకు ముందే ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి కొడుకును తీసుకుని వెళ్లిపోయాడు. రక్తం అంటిన చేతులు చూపిస్తూ తన బాధను, ఆవేదనను ఏడుస్తూ ఇన్స్టాగ్రాంలో వివరించాడు. ఈ వీడియోలు రెండూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన హాట్ టాపిక్ అయింది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు.
ఈ దాడిలో ఆమె చనిపోయిందని కొందరు, ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతుందని కొందరు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. భార్యపై దాడి చేసిన కేసులో పోలీసులు అక్షయ భర్త ధర్మరాజను అరెస్ట్ చేశారు. భార్య వివాహేతర సంబంధం.. భర్త క్షణికావేశం.. ఐదేళ్ల పిల్లాడిని అమ్మానాన్నకు దూరం చేసింది.
