వరల్డ్‌కప్‌లో జాతి వివక్ష కలకలం.. అర్జెంటీనాతో మ్యాచ్‌లో ఈజిప్ట్ కోచ్ 'X' సిగ్నల్‌తో FIFA అలర్ట్!

వరల్డ్‌కప్‌లో జాతి వివక్ష కలకలం.. అర్జెంటీనాతో మ్యాచ్‌లో ఈజిప్ట్ కోచ్ 'X' సిగ్నల్‌తో FIFA అలర్ట్!

Argentina vs Egypt: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఈజిప్ట్‌పై అర్జెంటీనా 3–2 తేడాతో సాధించిన విజయం ఇప్పుడు తీవ్ర వివాదాలకు దారితీసింది. అట్లాంటా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ముగింపు దశలో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి, ఈజిప్ట్ హెడ్ కోచ్ హోసామ్ హసన్ మధ్య మైదానంలో జరిగిన ఓ ఘర్షణ.. చివరకు ఫిఫా యాంటీ-రేసిజం ప్రొటోకాల్ యాక్టివేట్ అయ్యే వరకు వెళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చినప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ వివాదం ప్రపంచ దేశాలకి పాకింది. 

ఈజిప్ట్ కోచ్ 'X' సిగ్నల్ వెనకున్న అసలు కథేంటి:
మ్యాచ్ 92వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ హెడర్ ద్వారా అద్భుతమైన విన్నింగ్ గోల్ కొట్టి, తమ జట్టును 2–2తో గెలిపించాడు. ఆ సమయంలో ఈజిప్ట్ కోచ్ హోసామ్ హసన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. టచ్‌లైన్ వద్దకు వచ్చి, రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్ వైపు చూస్తూ తన రెండు చేతులను గుండెలపై క్రాస్‌గా పెట్టి 'X' గుర్తును ప్రదర్శించాడు. దీనిని చూసిన రిఫరీ వెంటనే ఆయనకు ఎల్లో కార్డ్ చూపించాడు.

ఈ 'X' గుర్తు ఎందుకు చూపిస్తారంటే: 
ఫుట్‌బాల్ మైదానంలో గానీ, స్టాండ్స్ నుంచి గానీ ఎవరైనా జాత్యహంకార వ్యాఖ్యలు (Racist comments) చేసినప్పుడు, వాటిని రిఫరీ దృష్టికి తీసుకెళ్లడానికి ఫిఫా కొత్తగా ప్రవేశపెట్టిన అధికారిక గుర్తే ఈ 'X' సింబల్. ఈ గుర్తును ప్రదర్శిస్తే మ్యాచ్‌ను తాత్కాలికంగా ఆపడం లేదా పూర్తిగా రద్దు చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే, కోచ్ హసన్ ఎలాంటి జాత్యహంకార వివక్షను నిరసిస్తూ ఈ గుర్తును చూపించలేదని మ్యాచ్ తర్వాత తెలిసింది. రిఫరీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై నిరసనను (Sarcastic) ప్రదర్శించడానికే ఆయన ఈ ఎక్స్ సిగ్నల్ ఒక ఆయుధంగా వాడుకున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

►ALSO READ | ఇలా చేశారేంటన్నా.. 76 పరుగులకే ఆలౌట్.. టీమిండియా ఓటమి, శ్రేయాస్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు

ఈజిప్ట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు: 
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈజిప్ట్ కోచ్ హసన్ రిఫరీల నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అర్జెంటీనా విన్నింగ్ గోల్ కొట్టడానికి కొన్ని క్షణాల ముందే, ఈజిప్ట్ సూపర్ స్టార్ మహమ్మద్ సలాను అర్జెంటీనా పెనాల్టీ బాక్స్‌లో కిందపడేసినా రిఫరీ ఫౌల్ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే అర్జెంటీనా కౌంటర్ ఎటాక్‌కు దిగి విన్నింగ్ గోల్ సాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక VAR రివ్యూతో ఈజిప్ట్ ప్లేయర్ మోస్తఫా జికో కొట్టిన ఒక లీగల్ గోల్‌ను క్యాన్సిల్ చేశారని, అలాగే అలెక్సిస్ మాక్ అలిస్టర్ షర్ట్ లాగినా శిక్షించలేదని హసన్ మండిపడ్డారు. రెఫరీ తీర్పుతో ఒక దేశం మొత్తం పడ్డ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని సీరియస్ అయ్యాడు.  

సూపర్ కమ్‌బ్యాక్ చేసిన మెస్సి సేన: 
ఈ వివాదాల పక్కన పెడితే మ్యాచ్ మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. మొదట ఈజిప్ట్ జట్టు అనూహ్యంగా 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి అర్జెంటీనాకు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి ఒక పెనాల్టీని మిస్ చేసినప్పటికీ, ఏమాత్రం పట్టువదలకుండా జట్టును ముందుండి నడిపించాడు. అద్భుతమైన ఆటతో అర్జెంటీనా వరుసగా 3 గోల్స్ కొట్టి ఊహించని విజయాన్ని అందుకొని క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.