నీళ్లు ఎత్తుకెళ్లే జగన్ ను ఏమీ అనరు గవర్నర్ పై మాత్రం విమర్శలా?

నీళ్లు ఎత్తుకెళ్లే జగన్ ను ఏమీ అనరు గవర్నర్ పై మాత్రం విమర్శలా?

 సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఫైర్

పోతిరెడ్డిపాడుకు పొక్కvకొట్టినా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడలే

కరోనాతో ప్రజలు ఆగమైతుంటే చలించలే

కేసీఆర్ సేన ఆగడాలు మితిమీరిపోతున్నాయని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: ‘‘పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి శ్రీశైలం నీళ్లను ఆంధ్రాకు తరలించుకుపోతూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న ఏపీ సీఎం జగన్ ను సీఎం కేసీఆర్ పల్లెత్తు మాట అనడంలేదు. కానీ పేదలకు కరోనా ట్రీట్ మెంట్ సరిగ్గా అందాలని చెప్పిన గవర్నర్ తమిళిసైని మాత్రం వ్యతిరేకిస్తున్నారు . తన అనుచరులతో ఆమెపై విమర్శలు చేయించడం విచారకరం’’అని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం ఆయన జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడారు.

గవర్నర్ ప్రజల పక్షాన నిలిచారు

‘‘కరోనాతో రాష్ట్ర ప్రజలు ఆగమైపోతుంటే సీఎం కేసీఆర్ ఏమాత్రం చలించలేదు. హాయిగా ఫాంహౌజ్ లో ఉన్నారు . కానీ గవర్నర్ తమిళిసై హాస్పి టల్స్ తిరిగారు. అలాంటి ఆమెకు వ్యతిరేకంగా తన పార్టీ ఎమ్మెల్యే తో విమర్శలు చేయించడం ఎంత వరకు సమంజసం’’అని వివేక్ ప్రశ్నించారు. గవర్నర్ కు వ్యతిరేకంగా కేసీఆర్, కేటీఆర్ సేనలు, సైన్యాలు సోషల్ మీడియాలో పోస్టులు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు . గవర్నర్ గా నరసింహన్ ను ఒకతీరుగా, తమిళిసైని మరో తీరుగా చూడటం అవమాన పర్చడమేనని మండిపడ్డారు . నరసింహన్ కు కావాల్సినవన్నీ కేసీఆర్ సమాకూర్చారని, పాదాభివందనం కూడా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు తమిళిసైపై కేసీఆర్ కక్షగట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే’’అని విమర్శించారు.

దాడులు చేస్తున్నరు

గ్రామాల్లో కేసీఆర్ సేన ఆగడాలు మితిమీరిపోతున్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు దిగుతున్నారని వివేక్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ కోసం పోరాటం చేస్తే.. కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో కోట్లు స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు . కరోనా కట్టడికి పైసా ఖర్చు చేయని కేసీఆర్.. రూ.22 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టుకు టెండర్లను పిలిచారని వివేక్ మండిపడ్డారు. సీఎంకు ప్రజల ఆరోగ్యం పై శ్రద్ధ లేదని.. ఫాంహౌజ్ లో ఉంటూ ఆంధ్రా కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేస్తున్నారని, కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు.