
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ సమావేశాలు కొత్తచర్చకు దారితీశాయి. అమిత్ షా, యోగీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అని అనడం చర్చనీయాంశంగా మారింది.. అమిత్ షా ఒక్కసారి హైదరాబాద్ అని వెంటనే భాగ్యనగరం అన్నారు. ఇదే సమయంలో పలువురు బీజేపీ నేతలు సైతం హైదరాబాద్ పేరు మారుస్తామంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ను భాగ్యనగరంగా మారుస్తామని జార్ఖాండ్ మాజీ సీఎం, బీజేపీ నేత రఘుబర్ దాస్ చెప్పారు.
అయితే రఘుబర్ దాస్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అహ్మదాబాద్ ను అదానీబాద్ గా ఎందుకు మార్చకూడదంటూ చురకలంటించారు. ఇంతకీ ఈ జుమ్లా జీవి ఎవరని ప్రశ్నించారు. కాగా జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా యోగి అదిత్యానాథ్ హైదరాబాద్ ను భాగ్యనగర్ గా మార్చడానికి బీజేకి ఓటువేయాలని కోరారు.
Why don’t you change Ahmedabad’s name to Adanibad first?
— KTR (@KTRTRS) July 3, 2022
Who is this Jhumla Jeevi by the way? https://t.co/xD8y6mrfUi