
గత కొన్నేళ్ల లెక్కలు చూస్తే భారతదేశంలో ఎన్నో రకాల దీర్ఘకాల వ్యాధుల ప్రమాదం వేగంగా పెరుగుతోందని స్పష్టమవుతుంది. చిన్న వయస్సులోనే మధుమేహం, గుండె జబ్బులు, జీవక్రియకు సంబంధించిన చాల రకాల వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు, దీని వల్ల ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణాల వార్తలు ఎక్కివగా వినిపిస్తున్నాయి, 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా ఈ కేసులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక రిపోర్టులో చాల కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శరీరాన్ని బలంగా, దృడంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు స్టెరాయిడ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై ఎన్నో రకాల చెడు ప్రభావాలు పడటమే కాకుండా యువతలో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని ఎయిమ్స్ నిపుణుల బృందం హెచ్చరించింది. శరీరాన్ని ఆకర్షణీయంగా మార్చుకోవాలనే ఈ వ్యామోహం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిరూపిస్తుంది.
ALSO READ : యాపిల్ తింటున్నారా.. అందులో కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది..!
స్టెరాయిడ్ల వాడకం : శరీరాన్ని ఫిట్ గా ఆకర్షణీయంగా మార్చుకోవాలనే కోరికతో దేశంలోని యువత ఇష్టం వచ్చినట్లు స్టెరాయిడ్లను ఉపయోగిస్తున్నారని, దీని వల్ల ఎముకలు కరగడం, హార్మోన్ల బ్యాలెన్స్ లేకపోవడం, గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) సీనియర్ వైద్యులు దీనిని ప్రజారోగ్య సంక్షోభంగా చెబుతూ, వెంటనే నివారణను డిమాండ్ చేశారు.
జిమ్‌కు వెళ్లే వారు జాగ్రత్త: కండలు పెరగడానికి, మంచి ఫిజిక్ కోసం పెద్ద పెద్ద సిటీల నుండి చిన్న నగరాల్లో జిమ్‌కు వెళ్లే యువతలో స్టెరాయిడ్ల వాడకం వేగంగా పెరిగింది. ఫిట్‌నెస్ ట్రైనర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తప్పుదారి పట్టిస్తూ చాలా మంది యువత అనబాలిక్ స్టెరాయిడ్ల తీసుకుంటున్నారు, ఇవి చాలా చెడు ప్రభావం చూపిస్తాయి.
నిపుణులు ఏమంటున్నారంటే: భారతదేశంలో ప్రతి నెల స్టెరాయిడ్ల కారణంగా ఎముకలు కరిగిపోతున్న కేసుల పెరుగుదల నమోదవుతున్నాయని ఎయిమ్స్ ఢిల్లీ ఎండోక్రినాలజీ విభాగం వైద్యులు హెచ్చరించారు. ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజేష్ మల్హోత్రా ప్రకారం, ఫిట్‌నెస్ పేరుతో స్టెరాయిడ్లు తీసుకుంటున్న 25-30 సంవత్సరాల వయస్సు ఉన్న యువకులు 40 ఏళ్లలోపే తుంటి మార్పిడి వంటి శస్త్రచికిత్సలు చేయించుకోవలసి వస్తుంది.
స్టెరాయిడ్లు ఎముకల శక్తిని, బలాన్ని దెబ్బతీస్తున్నాయని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారని ఎయిమ్స్ డాక్టర్ నిఖిల్ తివారీ అంటున్నారు. దీనిపై అవగాహన పెంచుకోకపోతే రాబోయే 5 ఏళ్లలో భారతదేశంలో యువకుల్లో ఎముకల వ్యాధి (చిన్న వయస్సులోనే ఎముకలు అరిగిపోవడం) ఒక అంటువ్యాధిగా మారోచ్చు అన్నారు.