సౌకర్యాలు లేకుండా ఇంగ్లీష్ ​మీడియం ఎందుకు?

సౌకర్యాలు లేకుండా ఇంగ్లీష్ ​మీడియం ఎందుకు?

మెదక్/శివ్వంపేట, వెలుగు: ‘మా స్కూల్​ బిల్డింగ్​ శిథిలావస్థలో ఉంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న స్కూల్​లో సౌకర్యాలు మెరుగు పర్చకుండా ఇంగ్లీష్  మీడియం ప్రవేశ పెట్టడం ఎందుకు?’ అని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చెన్నాపూర్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్​అన్నారు. జడ్పీ చైర్​పర్సన్​ హేమలత, నర్సాపూర్​ఎమ్మెల్యే మదన్​ రెడ్డి శనివారం చెన్నాపూర్​లో పల్లెప్రగతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్​ హెచ్ఎం లావణ్య మాట్లాడుతూ తమ స్కూల్​లో 54 మంది చదువుకుంటున్నారని చెప్పారు. బిల్డింగ్ కూలిపోయే దశలో ఉందని గతంలోనే చెప్పామని, మన ఊరు మన బడి కార్యక్రమం ఫస్ట్​ ఫేజ్​లోనే తమ స్కూల్​ సమస్య తీరుతుందనుకున్నామని, కానీ అలా జరగలేదని వాపోయారు. స్కూల్​కు కొత్త బిల్డింగ్​ నిర్మించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సెకండ్ ఫేజ్ లో చెన్నాపూర్​ స్కూల్​కు రెండు గదులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.