బాబా రాందేవ్ కు వ్యతిరేకంగా పిటిషన్

బాబా రాందేవ్ కు వ్యతిరేకంగా పిటిషన్

అల్లోపతి వైద్యాన్ని బాబా రాందేవ్ ఎందుకు విమర్శిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారని రాందేవ్ కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి.

యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చిన రాందేవ్ ఇతర వ్యవస్థలను విమర్శించడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. రాందేవ్ అనుసరించే విధానాలతో అన్నిరకాల వ్యాధులు నయం అవతాయని గ్యారెంటీ ఏంటని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది. ఆయుష్ కంపెనీ ద్వారా బాబా రాందేవ్ చేసిన ప్రకటనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.