బనకచర్లపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు : మంత్రి నిమ్మల

బనకచర్లపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు : మంత్రి నిమ్మల

బనకచర్లపై ఏపీ మాజీ సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఏపీ ఇరిగేషన్​ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఎందుకు స్పందించడంలేదని అన్నారు. రాయలసీమకు నీటి తరలింపుపై బీఆర్​ఎస్​ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంటే జగన్ మౌనంగా ఉండటమేంటని విమర్శించారు.

 ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్​ ప్రారంభోత్సవానికి నాడు ఏపీ సీఎం హోదాలో జగన్​ వెళ్లారు. నాడు ప్రగతిభవన్​లో కేసీఆర్​తో సమావేశమయ్యారు. అలాగే నగరిలోని నాటి మంత్రి రోజా ఇంటికి కేసీఆర్​ వెళ్లారు. ఆ రెండు సందర్భాల్లోనూ రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతమని కేసీఆర్​ చెప్పారు. గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించడం ఒక్కటే పరిష్కారమని కూడా చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలంటే అదొక్కటే మార్గమన్నారు. 

కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఈ ప్రాజెక్టు అభ్యంతరకరమని బీఆర్​ఎస్​ నేతలు చెప్పడం ఎంతవరకు సమంజసం? నాడు ఇరు రాష్ట్రాల సీఎంలు గోదావరి జలాల తరలింపు నిర్ణయం తీసుకున్నా.. ఇప్పుడు రాయలసీమ పచ్చనిపైరుగా మార్చే బనకచర్ల ప్రాజెక్టుపై నాడునిర్ణయం తీసుకున్న తోటి నాయకులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ మాజీ సీఎం జగన్​ ఎందుకు ఖండించడం లేదు?’’ అని రామానాయుడు ప్రశ్నించారు.