దేశం ఆకలితో అల్లాడుతుంటే.. కొత్త పార్లమెంట్ అవసరమా?

దేశం ఆకలితో అల్లాడుతుంటే.. కొత్త పార్లమెంట్ అవసరమా?

తమిళనాడులో 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు అయిన కమల్ హాసన్ తన పార్టీ ప్రచారాన్ని మదురైలో ప్రారంభించారు. పార్టీ ప్రచారాన్ని ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు ఆయన ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర అల్లకల్లోలంగా ఉన్న ఈ సమయంలో.. అన్ని నిధులు కేటాయించి కొత్త పార్లమెంట్ భవనం నిర్మించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అవినీతిని అంతమొందంచడం, ఉద్యోగాల కల్పన, గ్రామాభివృద్ధి మరియు తాగునీటి సరఫరా తమ పార్టీ లక్ష్యమని కమల్ హాసన్ అన్నారు. తమిళనాడు క్షీణించిపోయిందని.. మేం దానిని సరిదిద్దుతామని ఆయన అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కమల్ పార్టీ దాదాపు 4 శాతం ఓట్లు సాధించింది.

‘కరోనావైరస్ కారణంగా జీవనోపాధిని కోల్పోయి.. దేశంలో సగం మంది ఆకలితో ఉన్నప్పుడు రూ. 1,000 కోట్లతో కొత్త పార్లమెంటు భవనం నిర్మించడం ఎందుకు? చైనా గోడను నిర్మిస్తున్నప్పుడు కూడా వేలాది మంది మరణించారు. కానీ ఆ దేశ పాలకులు మాత్రం.. తమ ప్రజలను రక్షించడానికే ఈ గోడ నిర్మిస్తున్నామని చెప్పారు. మరి మీరు ఎవరిని రక్షించడానికి రూ .1,000 కోట్లతో ఈ కొత్త పార్లమెంటు నిర్మిస్తున్నారు? దయచేసి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి గౌరవ ప్రధాని గారు’అని కమల్ హాసన్ శనివారం ట్వీట్ చేశారు.

కొత్త పార్లమెంటు భవనం కోసం డిసెంబర్ 10న ఢిల్లీ నడిబొడ్డున ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఒక వేడుకను నిర్వహించారు. ఈ ప్రాజెక్టును నిర్మించడానికి దాదాపు రూ. 1000 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లు ప్రస్తుతం విచారణలో ఉన్నందున, వెంటనే పార్లమెంటు భవన నిర్మాణం మొదలుకాదు. ఈ ప్రాజెక్టుతో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తుందని గత వారమే అత్యున్నత న్యాయస్థానం ఆరోపించింది.

For More News..

ప్రేమ పెళ్లి చేసుకుందని చెల్లిని చంపిన అన్నలు

డోర్-టు-డోర్ ప్రచారం చేస్తున్న బీజేపీ కార్యకర్త హత్య

క్షీణిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

కలిసున్నప్పుడు ఓకే.. విడిపోయాక రేప్ అంటున్నారు