ఉల్లి ధర ఎందుకు పెరుగుతుంది.. మళ్లీ ఎప్పుడు తగ్గుతుంది

ఉల్లి ధర ఎందుకు పెరుగుతుంది.. మళ్లీ ఎప్పుడు తగ్గుతుంది

ఉల్లిధరలు పెరిగిపోతున్నాయి..కొనేటట్టు లేదు..తినేటట్టు లేదు..ఉల్లి ధరలు ఇలా పెరుక్కుంటూ పోతే  సామాన్యులం ఏం తినాలి..ఉల్లిగడ్డ లేనిదే కూరలు వంటడం కష్టం.. ఇలా రేట్లు పెరుగుతూ పోతుంటే ఎవరూ పట్టించుకోరేంది..అసలు ఉల్లి ధరలు పదే పదే ఎందుకు పెరుగుతున్నాయి.. వీటిని కంట్రోల్ లో పెట్టలేరా? .. ఇవీ..మనకు తరుచుగా సాధారణ జనం నుంచి వినిపించే క్వశ్చన్లు.. నిజమే మరి.. ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో.. అవి ఎప్పుడెప్పుడు తగ్గుతున్నాయో ఒక్కసారి చూద్దాం. 

గత రెండు వారాల క్రితం 25 రూపాయలున్న కిలో ఉల్లి ధర అమాంతం పెరిగిపోయింది. కిలో ఉల్లి ధర రిటైల్ షాపులలో 47 రూపాయలకు చేరింది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంట. గతేడాది ఇదే సీజన్ లో కిలో ఉల్లి ధర రూ. 30 ఉంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బఫరింగ్ చేసిన ఉల్లిని రూ. 25లకే విక్రయించేందుకు ఉల్లి లేవ్ అవుట్లను తెరిచింది. 

ఉల్లి ధర ఎందుకు ఇంత ఎక్కువ 

వాతావరణ కారణంగా ఖరీఫ్ ఉల్లి ఆలస్యం కావడం..పంట ఆలస్యంగా రావడం దీనికి ప్రధాన కారణం అంటున్నారు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ అధికారులు. ఖరీఫ్ ఉల్లి ఇప్పటికే మార్కెట్ లోకి రావాల్సి ఉండగా.. ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతోపాటు నిల్వ చేసిన రబీ ఉల్లి అయిపోవడం ఉల్లి ధరలు పెరుగుటకు కారణమయ్యాయని తెలిపారు. ఉల్లి సరఫరాలో ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఉన్నాయి.. హోల్ సేల్, రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు పెరిగాయని అధికారులు చెపుతున్నారు. 

ధరల నియంత్రణకు ప్రభుత్వం ఏంచేస్తోంది 

దేశీయ మార్కెట్లో కూరగాయల లభ్యత పెంచడం, ధరలను అదుపు చేయడం లక్ష్యంగా 2024 డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతులపై టన్నుకు 800 డాలర్ల కనీస ఎగుమతి ధర పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అక్టోబర్ 29 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అంతేకాకుండా ఉల్లి నిల్వలు పెంచేందుకు అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లి సేకరణను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే సేకరించిన 5 లక్షల టన్నులకు పైగా బెంగుళూరు గులాబీ ఉల్లి, కృష్ణాపురం ఉల్లి పాయలు మినగా అన్ని రకాల ఉల్లికి మినిమం ఎక్స్ పోర్ట్ ప్రైస్ (MEP ) ఉంది. ఇది సరసమైన ధరలకు వినియోగదారులకు తగినంత ఉల్లిని అందించేందుకు సహాయ పడుతుందని.. జనవరిలో ఉల్లి ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.