సెల్ఫీలంటే ఎందుకంత క్రేజ్​..? చూసేద్దాం పదండి..

సెల్ఫీలంటే ఎందుకంత క్రేజ్​..? చూసేద్దాం పదండి..

స్మార్ట్​ ఫోన్​లు అందుబాటులోకి వచ్చాక యూత్​ని, వాటిని విడదీసి చూడలేని పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా కుర్రకారుకు సెల్ఫీల పిచ్చి ఇంతింతై వటుడింతై అన్న రేంజ్​లో పెరిగింది. మారుతున్న టెక్నాలజీకనుగుణంగా వస్తున్న ఫోన్లు వాటిల్లో విభిన్న మెగా పిక్సల్​ కెమెరాలు యువతను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. మరి అలాంటి ఒక మొబైల్​ మన చేతిలోకి వస్తే మొదట వచ్చే థాట్​ ఏంటి..? అంటే టక్కున చెప్పేది సెల్ఫీ. అవునండీ సెల్ఫీ తో అనుబంధం లేని కుర్రకారుని ఊహించుకోలేము. మరి సెల్ఫీలంటే ఎందుకంత ఆసక్తి అదే తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఆ విశేషాలేంటో చూసేద్దాం పదండి.

ఆరు ప్రయోగాలు..

జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ట్యూబింగెన్ ఒహియో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు 2,113 మందిపై ఆరు ప్రయోగాలు నిర్వహించారు. వారి నివేదిక ప్రకారం.. సెల్ఫీలతో గుండె, మెదడుకు లోతైన సంబంధం ఉందట.   మనం ఎలా చూడాలనుకుంటున్నామో అదే చిత్రాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది.  సెల్ఫీలు పాత జ్ఞాపకాలతో కనెక్ట్ అయ్యేందుకు దోహదపడతాయని.. అలాంటి ఫోటోలు ముందుకు రాగానే ఆనాటి జ్ఞాపకాలన్నీ తాజాగా మారతాయని పరిశోధన రచయిత జకరీ నీస్ తెలిపారు. ఫొటోలు తీసే వ్యక్తులకు కూడా వ్యక్తిగత ఉద్దేశాలు ఉంటాయని ఈ అధ్యయనం లో వెల్లడయింది.