నైట్ మొత్తం ఏసీలో పడుకుంటున్నారా..? మార్నింగ్ నిద్ర లేవగానే ఇలా అనిపిస్తుందంటే మాత్రం ఇదే కారణం !

నైట్ మొత్తం ఏసీలో పడుకుంటున్నారా..? మార్నింగ్ నిద్ర లేవగానే ఇలా అనిపిస్తుందంటే మాత్రం ఇదే కారణం !

ఈ ఎండలకు తట్టుకోలేక కరెంట్ బిల్లు ఎక్కువైనా సరే చాలా మది ఈ మధ్య ఏసీలు కొని తెచ్చుకుంటున్నారు. బయట ఎంత ఎండగా ఉన్నా ఏసీలో హాయిగా కూల్కూల్గా ఉంటున్నారు. అయితే.. కొందరు సీజన్లతో సంబంధం లేకుండా రాత్రుళ్లు ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోతుంటారు. ఇలా ఏసీలో పడుకునే కొందరికి ఉదయాన్నే నిద్ర లేవగానే తలనొప్పి వస్తుంటుంది. ఇందుకు.. ఏసీనే కారణం ఏమోనని ఆలోచిస్తుంటారు. 

ఈ సందేహంపై న్యూరాలజిస్టులు ఏం చెబుతున్నారంటే.. ఈ తలనొప్పికి ఎయిర్ కండిషనర్ కారణం కాదు. ఇంటి లోపల పొడి వాతావరణం కారణంగా డీహైడ్రేషన్, కండరాల చికాకు కలగడం వల్ల తలనొప్పులు వస్తాయి. రూంలో ఉండే తేమ స్థాయిని తగ్గించడం ద్వారా దానిని చల్లగా చేయడమే ఏసీ పని. ఇది వేడి వాతావరణంలో సౌకర్యంగా అనిపించినప్పటికీ.. దీనివల్ల రూంలో పొడిదనం కూడా పెరుగుతుంది.

►ALSO READ | రంగుమారితే పారేయాల్సిందేనా.. జీడిపప్పు పాడైపోయిందని ఎలా గుర్తించాలి ? తింటే ఏమవుతుంది?

తేమ తగ్గడం వల్ల శరీరంలో నీటి శాతం కూడా తగ్గుతుంది. డీహైడ్రేషన్ వల్ల చిరాకు, చికాకుతో పాటు తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఏసీ కింద పడుకున్న తర్వాత.. తలనొప్పి కారణంగా మెలకువ రావడం, ఉదయం నిద్ర లేవగానే కొద్దిసేపు తలనొప్పిగా అనిపించడానికి కారణం కండరాలు బిగుసుకుపోవడమే.

మన శరీరం మీదకు ఏసీ నుంచి చల్లని గాలి అదేపనిగా వస్తుండటం వల్ల.. మెడ, భుజం, తల దగ్గర కండరాలు బిగుసుకుపోతాయి. ఏసీలో పడుకున్నప్పుడు.. రాత్రంతా ఇలా కండరాలు బిగుసుకుపోవడం వల్ల ఉదయం నిద్ర లేవగానే తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.