6వేల వీసాలను రద్దు చేసిన అమెరికా.. ఎందుకు స్టూడెంట్స్ ని టార్గెట్ చేసిందంటే ?

 6వేల వీసాలను రద్దు చేసిన అమెరికా.. ఎందుకు స్టూడెంట్స్ ని టార్గెట్ చేసిందంటే ?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అక్రమంగా అమెరికాలోకి వచ్చే వలసలను అరికట్టే చర్యలలో భాగంగా 6వేలకి పైగా వీసాలను రద్దు చేసింది. ఫ్లోరిడాలో ఒక ట్రక్ డ్రైవర్ చేసిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆ డ్రైవర్ అక్రమ వలసదారుడని తెలియడంతో ఈ చర్యలు వేగవంతమయ్యాయి.

ఎవరి వీసాలు రద్దు అయ్యాయి: చట్టాలను ఉల్లంఘించినందుకు సుమారు 4,000 వీసాలు రద్దు అయ్యాయి. వీటిలో ఎక్కువ భాగం దాడులు, తాగి వాహనం నడపడం, దొంగతనం వంటి నేరాలకు సంబంధించినవి ఉన్నాయి.

ఉగ్రవాద కార్యకలాపాలు లేదా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న 200 నుండి 300 వీసాలు కూడా రద్దు చేసింది.

విద్యార్థులను ఎందుకు టార్గెట్  చేసింది : అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్ వీసాలపై కఠినంగా వ్యవహరిస్తోంది. గాజా యుద్ధంపై పాలస్తీనాకు సపోర్ట్ చేస్తున్న విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల కారణంగా ట్రంప్ కొన్ని యూనివర్సిటీలు వ్యతిరేకతకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపించారు.