కూల్చివేతపై హైకోర్టులో వాదనలు
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్‌ను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై దాఖలైన అన్ని పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఉమ్మడి ఏపీలోనే ఉపయోగపడిన సెక్రటేరియెట్ ఇప్పుడెందుకు పనికిరానిదయ్యిందంటూ పిటిషనర్ల తరఫున లాయర్ ప్రశ్నించారు. పార్లమెంట్ చేసిన ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్8(2) ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న సచివాలయాన్ని 2024 వరకు కూల్చివేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు ఉందని, ఇటీవల ఎర్రమంజిల్ భవనం కూల్చివేతను తప్పుపడుతూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. సెక్రటేరియెట్ కూల్చివేసేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారాలున్నాయని సర్కార్ తరఫున లాయర్ వాదించారు. కేబినెట్ నిర్ణయాలలో కోర్టులకు జోక్యం చేసుకునే అధికారం లేదన్నారు. ప్రభుత్వ పాలసీలను ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని గుర్తుచేశారు.
For More News..
