IPL ట్రోఫీలు గెలిపించిన పాటిదార్కి టీమిండియాలోకి నో ఎంట్రీ.. అందరికీ ఛాన్స్ ఇవ్వలేమన్న BCCI

IPL ట్రోఫీలు గెలిపించిన పాటిదార్కి టీమిండియాలోకి నో ఎంట్రీ.. అందరికీ ఛాన్స్ ఇవ్వలేమన్న BCCI

Ajit Agarkar Rajat Patidar India Snub: భారత క్రికెట్ లో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, కొన్నిసార్లు లక్, సెలక్టర్ల దయ లేకపోతే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో చెప్పడానికి పక్కా ఎగ్జాంపుల్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కి వరుసగా రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించి హిస్టరీ క్రియేట్ చేసిన రజత్ పాటిదార్ కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ గట్టి షాక్ ఇచ్చింది. 

పాటిదార్ సెలక్ట్ చేయకపోవడంపై వివాదం: 
రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత టీ20 స్వ్యాడ్ లో రజత్ పాటిదార్ పేరు ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇప్పటివరకు 192.69 స్ట్రైక్ రేట్ తో పాటు ఏకంగా 501 పరుగులు బాదాడు. ఇందులో 30 ఫోర్లు, 42 సిక్సులు ఉన్నాయి. ముఖ్యంగా 12 నుంచి 16 ఓవర్ల మధ్య కేవలం 108 బంతుల్లోనే 216.67 స్ట్రైక్ రేట్ తో 234 రన్స్ చేశాడు. అలాగే డెత్ (17–20) ఓవర్లలో పాటిదార్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 278.57గా ఉంది.. చివరి నాలుగు ఓవర్లలో బౌలర్లను ఏ రేంజ్ తో రజత్ ఉతికేశాడో మీరు అర్థం చేసుకోవచ్చు. 

అజిత్ అగార్కర్ ఏమ్మన్నారంటే: 
శనివారం భారత టీ20 స్వ్యాడ్ ని ప్రకటించిన తర్వాత బీసీసీఐ చీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రజత్ పాటిదార్ ని ఎందుకు జట్టులోకి తీసుకోలేదో మీడియాకి చెప్పుకొచ్చాడు. భారత్ లో చాలా మంది టాలెంట్ ప్లేయర్స్ ఉన్నారు, డైరెక్టుగా జట్టులోకి వచ్చే సత్తా ఉన్నోళ్లు ఎంతో మంది ఉన్నారు.. కానీ మేము కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేస్తాం.. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తున్నారు.. మేము బెస్ట్ స్వ్యాడ్ నే సెలక్ట్ చేస్తాం.. కొందరికి ఛాన్స్ మిస్ కావడం సహజమే అని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు అగార్కర్. 

ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లకి తుది జట్లు: 
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్.