T20 World Cup 2024: ఒక్క స్థానానికి ఐదుగురు.. టీ20‌ వరల్డ్ కప్‌కు భారత వికెట్ కీపర్ ఎవరు?

T20 World Cup 2024: ఒక్క స్థానానికి ఐదుగురు.. టీ20‌ వరల్డ్ కప్‌కు భారత వికెట్ కీపర్ ఎవరు?

టీ20 వరల్డ్ కప్ కు భారత వికెట్ కీపర్ ఎవరు..? ప్రస్తుతం ఈ ప్రశ్న బీసీసీఐకు పెద్ద సవాలుగా మారింది. ఎవరిని ఎంపిక చేయాలో అర్ధం కాక సెలక్టర్లు గందరగోళానికి గురవుతున్నారు. రేస్ లో ఏకంగా 5 గురు వికెట్ కీపర్ లు ఉన్నారు. గాయం నుంచి కమ్ బ్యాక్ ఇచ్చిన రిషబ్ పంత్, ఐపీఎల్ లో అదరగొడుతున్న సంజు సామ్సన్, యువ వికెట్ కీపర్స్ జితేష్ శర్మ, ఇషాన్ కిషాన్, అనుభవజ్ఞుడు కేఎల్ రాహుల్ టీ20 వరల్డ్ కప్ స్థానం కోసం పోటీపడుతున్నారు. వీరిలో ఎవరికి ఎక్కువ ఛాన్స్ లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

రిషబ్ పంత్:

గాయం నుంచి తిరిగొచ్చి ఐపీఎల్ లో సత్తా చాటుతున్న పంత్ ఈ రేస్ లో ముందు వరుసలో ఉన్నాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయినా.. చెన్నై, కోల్ కతా తో జరిగిన మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీలు చేసి పునర్వైభవాన్ని చూపించాడు. లెఫ్ట్ హ్యాండర్ కావడం.. అటాకింగ్ చేయడం లాంటి విషయాలు పంత్ కు అనుకూల అంశాలు. 

సంజు శాంసన్:

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో సంజు శాంసన్ రాణిస్తున్నాడు. లక్నోతో జరిగిన తొలి మ్యాచ్ లో ఇన్నింగ్స్ చివరి వరకు బ్యాటింగ్ చేసిన ఈ కేరళ ఆటగాడు.. రాయల్ చాలెంజర్స్ పై ఒత్తిడిలో రాణిస్తూ 42 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలగడం శాంసన్ కు కలిసి వచ్చే అంశం. 

ఇషాన్ కిషాన్:

భారత జట్టులో అడపా దడపా చోటు దక్కించుకుంటున్న కిషాన్.. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున దారుణంగా విఫలమవుతున్నాడు. రోహిత్ కు జోడీగా ఓపెనర్ గా రావాలనుకుంటే లెఫ్ట్ హ్యాండర్ గా కిషాన్ ఈ రేస్ లో ముందుంటాడు. కానీ జైస్వాల్ లాంటి యంగ్ ప్లేయర్ రాణిస్తుండడంతో కిషాన్ స్థానంపై సందేహాలు ఏర్పడ్డాయి. 

కేఎల్ రాహుల్ :

భారత జట్టులో వరుసగా విఫలమవుతున్నా ఛాన్స్ లు దక్కించుకుంటున్నాడు రాహుల్. చివరి రెండు (2021,2022) టీ20 వరల్డ్ కప్ లో ఓపెనర్ గా వచ్చి విఫలమయ్యాడు. ఈ సారి జట్టులో స్థానం దక్కడం సందేహంగానే కనిపిస్తుంది. ఒకవేళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ పై సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఐపీఎల్ లో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం రాహుల్ కు ప్రతికూలంగా మారింది.  

జితేష్ శర్మ:

యంగ్ వికెట్ కీపర్ జితేష్ శర్మ ఈ లైనప్ లో ఉన్నాడు. 2023 చివర్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జరిగిన టీ20ల్లో జితేష్ చోటు దక్కించుకొని రాణించాడు. దూకుడుగా ఆడటం ఇతనికి కలిస్తుంది వచ్చే అంశం. కొత్తగా ప్రయత్నించాలనుకుంటే జితేష్ శర్మకు అవకాశం దక్కినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో పెద్దగా ఆకట్టుకోలేపోవడం అతనికి ప్రతికూలంగా మారింది.