10 మంది పిల్లల తల్లి.. ప్రియుడితో జంప్..  ఆ తర్వాత ఏం జరిగిందంటే...

10 మంది పిల్లల తల్లి.. ప్రియుడితో జంప్..  ఆ తర్వాత ఏం జరిగిందంటే...

పెళ్లంటే నూరేళ్ల పంట..జీవితాంత కాలం గుర్తుండిపోయేలా  వివాహ వేడుకలు జరుపుకుంటారు.  అయితే తాజాగా  యూపీలో  ఓ విచిత్రమైన వివాహం జరిగింది. 10 మంది పిల్లలున్న ఓ వితంతువు.. యువకుడిని పెళ్లడటం వైరల్​ గా మారింది.  కుటుంబ సభ్యుల మధ్య సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకుంది. ఈ అరుదైన పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.

ఆరేళ్ల కిందట అనారోగ్యంతో మొదటి భర్త మృతి

పది మంది పిల్లలకు తల్లైన ఓ వితంతువు తన ప్రియుడ్ని వివాహం చేసుకుంది. గ్రామస్థులు, పెద్దలు దగ్గరుండి ఈ పెళ్లిని జరిపించారు. అంతేకాదు, వీరికి ఓ కాలేజీ ఉద్యోగాలు ఇచ్చి, ఉండటానికి ఇంటి సౌకర్యం కూడా కల్పించడం గమనార్హం. అరుదైన ఈ వివాహం ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్ జిల్లా బహల్‌గంజ్ ప్రాంతంలోని దాద్రి గ్రామానికి సోనీ శర్మ(42) అనే మహిళ భర్త ఆరేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటికే వీరికి పది మంది పిల్లలు ఉన్నారు.

పెళ్లికాని మరో వ్యక్తితో ప్రేమలో పడిన మహిళ

భర్త చనిపోయిన తర్వాత డియోరియా జిల్లా నకైల్ గ్రామానికి చెందిన బాలేంద్ర యాదవ్ (40) అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. బాలేంద్ర అవివాహితుడా కాగా.. ఏడాది కిందట ప్రియుడితో కలిసి సోనీ వెళ్లిపోయింది. తన వెంట నలుగురు పిల్లల్ని తీసుకెళ్లి.. మిగతావారిని అక్కడే వదిలిపెట్టింది. వేరే ప్రాంతంలో నివాసం ఉంటోన్న సోనీ.. అప్పడప్పుడు దాద్రికి వచ్చే వెళ్తుండేది. ఆమె యోగక్షేమాల గురించి గ్రామస్థులు అడిగి తెలుసుకునేవారు. బాలేంద్ర, సోనీల ప్రేమ విషయం గ్రామస్థులకు తెలియడంతో పెళ్లి చేశారు.   ఆ పది మంది పిల్లలకు కొత్త జీవితం ప్రసాదించాలని నిర్ణయించుకున్నారు.

పంచాయతీలో వివాహం జరిపించాలని తీర్మానం

స్థానిక  గురుకుల పీజీ కళాశాల ప్రిన్సిపల్ జై ప్రకాశ్ షాహీ.. సోనీశర్మ, బాలేంద్రను గ్రామానికి రప్పించి, పెళ్లి ప్రతిపాదన గురించి పెద్దలతో పంచాయతీ పెట్టారు. ఇద్దరినీ ఒప్పించిన అనంతరం గ్రామంలో ఉన్న శివాలయంలో వివాహం జరిపించారు. గ్రామస్థుల సమక్షంలో ఒక్కటైన సోనీ, బాలేంద్రలు.. దండలు మార్చుకున్నారు. సోనీ, బాలేంద్రలకు తమ కాలేజీలో ఉద్యోగాలు ఇస్తున్నట్టు జై ప్రకాశ్ ప్రకటించారు. వారితో పాటు ఆ పది మంది పిల్లలకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఆ కుటుంబానికి ఉచితంగా వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.