భార్య కిడ్నీ భర్తకు దానం.. మల్లారెడ్డి హాస్పిటల్​లో ఆపరేషన్ సక్సెస్

భార్య కిడ్నీ భర్తకు దానం.. మల్లారెడ్డి హాస్పిటల్​లో ఆపరేషన్ సక్సెస్

జీడిమెట్ల, వెలుగు : హైదరాబాద్​లో  మల్లారెడ్డి నారాయణ యాజమాన్యం మొట్టమొదటిసారి కిడ్నీ మార్పిడి చికిత్సను విజయవంతం చేసిందని మల్లారెడ్డి హెల్త్​సిటీ చైర్మన్​ భద్రారెడ్డి తెలిపారు. గురువారం సూరారంలోని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. బౌరంపేట​కు చెందిన నవీన్​కు కిడ్నీ దెబ్బతింది. అతని భార్య కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు.

దీంతో ఆస్పత్రికి చెందిన ఎం.గోపి కిషోర్​, డా.కె.శేషుమోహన్​, డా.సూర్యనారాయణ్​, డా.సంగీత, డా.రాధా రమణమూర్తి టీమ్​ అత్యాధునిక పరికరాలతో , అతితక్కువ ఖర్చుతో కిడ్నీ మార్పిడి చేశారని భద్రారెడ్డి వివరించారు. దంపతులు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని అభినందించారు. అనంతరం జీవన్​దాన్​ ప్రోగ్రాం ఇన్​చార్జ్ జి.స్వర్ణలత మాట్లాడుతూ ప్రజల్లో అవయవదానాలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కిడ్నీ మార్పిడి చేసినందుకు మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినందించారు.