వివాహేతరసంబంధానికి అడ్డొస్తున్నాడని..నిద్రలో ఉండగా ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన భార్య

వివాహేతరసంబంధానికి అడ్డొస్తున్నాడని..నిద్రలో ఉండగా ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన భార్య

రంగారెడ్డి: దారుణం..ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా  కడతేర్చింది.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. నిద్రలో ఉన్నోడిని చంపేసింది. ఏమీ తెలియనట్టు అనుమానాస్పద మృతిగా చిత్రీకరించే ప్లాన్​ చేసింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తోంది. వివరాల్లోకి వెళితే.. 

రంగారెడ్డి జిల్లా మీర్​ పేట్ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని జిల్లెలగూడ సాయి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న అల్లంపల్లి విజయ్​ కుమార్, సంధ్య భార్యభర్తలు.. వీరికి ముగ్గురు పిల్లలు. విజయ్​ కుమార్​ ఆటో డ్రైవర్​ గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంధ్య పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. ముగ్గురు పిల్లలతో సంసారం చక్కగా సాగుతున్న క్రమంలో సంధ్య వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. 

భార్య సంధ్య మరో వ్యక్తి వివాహేతర సంబంధం సాగిస్తున్న విషయం భర్త విజయ్​ తెలియడంతో మందలించాడు.. ఈక్రమంలో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని విజయ్​పై సంధ్య కోపం పెంచుకుంది.. ఎలాగైన భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్​ చేసింది. 

శనివారం రాత్రి నిద్రలో ఉన్న భర్త విజయ్​ ను హత్య చేసేందుకు ప్లాన్​ వేసింది. ఇనుపరాడ్డుతో తలపైకొట్టి హతమార్చింది.. ఏమీ తెలియనట్లు శవాన్ని ఇంటిముందు పడేసి అనుమానాస్పద మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

 మృతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు హంతకుడిని పట్టుకునే పనిలో పడ్డారు.. లేటెస్ట్​ టెక్నాలజీతో విజయ్​ ని చంపింది సంధ్యే నని అనుమానించారు. సంధ్య ని విచారిస్తే అసలు విషయం బయటికొచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే భర్త విజయ్​ని తాను హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకుంది.