కేంద్రం కీలక నిర్ణయం: సిలిండర్ బుకింగ్ గడువు 21 నుంచి 25 రోజులకు పెంపు

కేంద్రం కీలక నిర్ణయం: సిలిండర్ బుకింగ్ గడువు 21 నుంచి 25 రోజులకు పెంపు

న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధంతో ముంచుకొస్తున్న ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వంట గ్యాస్ (ఎల్పీజీ) అక్రమ నిల్వలను అరికట్టేందుకు రీఫిల్ సిలిండర్ల బుకింగ్ గడువును పెంచింది. ఇప్పటిదాకా ఒక సిలిండర్ పొందిన 21 రోజుల తర్వాత మరో సిలిండర్ బుకింగ్‌‌‌‌కు అవకాశం ఉండేది. 

దాన్ని ఇప్పుడు 25 రోజులకు పెంచుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరాపై అనిశ్చితి ఏర్పడిన  నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, ప్రస్తుతం దేశంలో ఇంధన కొరత లేదని.. ప్రజలు భయాందోళన చెందవద్దని స్పష్టం చేసింది.