మందుకు డబ్బులివ్వలేదని భార్య హత్య

మందుకు డబ్బులివ్వలేదని భార్య హత్య

శంషాబాద్, వెలుగు: మద్యం మత్తులో భార్యను హత్య చేశాడో భర్త. అలివేలు అనే వ్యక్తి భార్య నర్సమ్మతో కలిసి శంషాబాద్ లోని సంజయ్ వాడ గ్రామంలో కొంతకాలంగా ఉంటున్నాడు. బుధవారం అలివేలు మద్యం తాగేందుకు భార్యను డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వడానికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికే మద్యం తాగి ఉన్న అలివేలు చీర కొంగు నర్సమ్మ మెడకు చుట్టి కర్రతో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.