ల్యాప్ టాప్ ను.. అంట్లు క‌డిగిన‌ట్లు క‌డిగేసిన భార్య‌..

ల్యాప్ టాప్ ను.. అంట్లు క‌డిగిన‌ట్లు క‌డిగేసిన భార్య‌..

డాక్టర్ అపాయింట్ మెంట్, బ్యాంక్ వర్క్, ఐడీ కార్డు మర్చిపోవడం.. ఇవి చాలా మంది ఉద్యోగులు, తమ పనిలో జరిగిన ఆలస్యానికి బాస్ కు చేప్పే కారణాలు. కొన్ని సార్లు కొందరు చెప్పే కారణాలు అత్యంత ఆసక్తిగా, ఆశ్చర్యంగానూ అనిపిస్తాయి.

ఉజ్జ్వల్ అత్రవ్ అనే ఉద్యోగి సమయానికి వర్క్ లాగిన్ కాకపోవడంతో అతని బాస్ నుంచి మెసేజ్ వచ్చింది. ఈ సందర్బంగా తనకు, తన యజమానికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఓ చాట్ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చాట్ లో నువ్వు ఇంకా లాగిన్ కాలేదు ఏమైంది అని బాస్ వాట్సాప్ లో మెసేజ్ చేశాడు. దానికి స్వారీ చెప్పిన ఉజ్జ్వల్.. ఓ ల్యాప్ టాప్ వాషింగ్ మీమ్ ను పంపాడు. ఈ ఫొటో టీవీ సీరియల్ ఆత్ నిభానా సాథియా కు సంబంధించింది. తన భార్య తన ల్యాప్ టాప్ ను డిష్ వాషింగ్ సబ్బుతో శుభ్రం చేయడంతో... అతను ఎండలో ఆరబెట్టాడు. దీనికి బాస్ ఇచ్చిన రిప్లై అందర్నీ ఆకట్టుకుంటోంది. నీ శాలరీ హైక్ ఆశలపైనా కూడా నీళ్లు చల్లుతా అని బాస్ రిప్లయ్ ఇవ్వడం ఆ ఎంప్లాయినే కాదు.. నెటిజన్లనూ షాక్ కు గురి చేస్తోంది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖ్యంగా బాస్ చేసిన కామెంట్స్ పై చాలా మంది స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ పోస్ట్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. దీనికి ఇప్పటివరకు 30వేల కంటే ఎక్కువ వ్యూస్ రాగా... ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. బాస్ 1, ఉజ్జ్వల్ 0 అని ఒకరు కామెంట్ చేయగా, అయ్యే ఎమోషనల్ డ్యామేజ్ అంటూ ఇంకొకరు రాసుకొచ్చారు.