జూలియన్‌ అసాంజే లండన్‌లో అరెస్టు

జూలియన్‌ అసాంజే లండన్‌లో అరెస్టు

లీక్స్ తో ప్రపంచంలోని అవినీతిపరులను ముప్పుతిప్పలు పెట్టిన… వికీలీక్స్ వ్యవస్థాపకుడు 47ఏళ్ల జూలియన్‌ అసాంజేను ఇవాళ (గురువారం) లండన్‌లో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని యూకే పోలీసులు కన్ఫామ్ చేశారు. ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్న ఏడేళ్ల తర్వాత అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అసాంజే ఏడేళ్ల క్రితం ఎంబసీలో శరణార్ధులుగా ఉన్నపుడు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు. సాధ్యమైనంత త్వరలో అసాంజేను లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

మరోవైపు అసాంజేని అరెస్ట్ చేసేందుకు లండన్ తో ఈక్వేడార్ ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకుందంటూ వికీలీక్స్ ఇటీవల ట్వీట్‌ చేసి సంచలనం రేపింది. ఈక్వేడార్ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల నుంచి తమకు ఈ సమాచారం అందినట్లు వికీలీక్స్ తెలిపింది. ఐఎన్‌ఏ పేపర్స్ లీక్ చేసి ఆఫ్షోర్ కుంభకోణం బయటపెట్టాడన్న కారణంతో ఈక్వేడార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అసాంజే అరెస్ట్‌ పై స్పందించిన వికీలీక్స్‌ బ్రిటిష్‌ పోలీసులను ఆహ్వానించి మరీ ఆయన అదుపులోకి తీసుకున్నారని ట్వీట్‌ చేసింది.

కాగా లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో అరెస్టునుంచి తప్పించుకునేందుకు, స్వీడన్‌కు అప్పగించకుండా ఉండేందుకు 2012 నుంచి అసాంజే లండన్‌లోని ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నాడు.