'హిట్2' రిలీజ్‌‌పై అతి త్వరలోనే గ్రాండ్‌‌గా అనౌన్స్ చేస్తాం

'హిట్2' రిలీజ్‌‌పై అతి త్వరలోనే గ్రాండ్‌‌గా అనౌన్స్ చేస్తాం

రీసెంట్‌‌గా ‘మేజర్‌‌‌‌’ సినిమాతో సక్సెస్ అందుకున్న అడివి శేష్.. వెంటనే తన నెక్స్ట్‌‌ మూవీపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ‘హిట్: ద సెకెండ్ కేస్’ సినిమాలో నటిస్తున్నాడు. నాని నిర్మాణంలో శైలేష్ కొలను రూపొందిస్తున్న ఈ మూవీని జులై 29న రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. కానీ ఆ డేట్‌‌కి సినిమా రావడం లేదంటూ నిన్న ఓ నోట్ రిలీజ్ చేశాడు. ‘మేజర్‌‌ రిలీజ్‌‌ కాగానే ‘హిట్‌‌2’ షూటింగ్‌‌లో పాల్గొనాలి. ఆఖరి షెడ్యూల్‌‌ని పూర్తి చేయాలి. కానీ మేజర్‌‌ సందీప్‌‌ ఉన్నికృష్ణన్‌‌ కథని ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయాన్ని కేటాయించాను.

శారీరకంగా, మానసికంగా అత్యంత సంతృప్తినిచ్చిన క్షణాల్ని ఆస్వాదించాను. ఆ విషయాన్ని నానీకి,  శైలేష్‌‌కి వివరించాను. ఫైనల్‌‌ షెడ్యూల్‌‌ని త్వరలో పూర్తి చేసేస్తానని చెప్పాను. వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు. చివరి షెడ్యూల్‌‌ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్‌‌ పనులు మొదలుపెడతాం. ‘హిట్2’ రిలీజ్‌‌ గురించి అతి త్వరలోనే గ్రాండ్‌‌గా అనౌన్స్ చేస్తాం’ అని నోట్‌‌లో వివరించాడు శేష్. హిట్ (హోమిసైడ్ ఇంటర్‌‌‌‌వెన్షన్ టీమ్) ఆఫీసర్ కృష్ణ దేవ్ అలియాస్ కేడీగా కనిపించనున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్. భానుచందర్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.