తగ్గేదేలా : రాజీనామా చేయరు.. జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ పాలన

తగ్గేదేలా : రాజీనామా చేయరు.. జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ పాలన

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు.. మరి రాజీనామా చేస్తారా అంటే.. అబ్బే తగ్గేదేలా.. జైలు నుంచి ఢిల్లీని పాలిస్తారు మా కేజ్రీవాల్ అని స్పష్టం చేశారు ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయరని.. అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆప్ పార్టీ అగ్రనేతలు అందరూ ఇదే విషయానికి కట్టుబడి ఉన్నారని.. రాబోయే రోజుల్లోనూ ఇదే నిర్ణయంతో ఉంటామని తేల్చిచెప్పారు మంత్రి అతిషి. 

చట్టం ఏం చెబుతుంది అనే విషయానికి వస్తే.. చట్ట ప్రకారం.. కేజ్రీవాల్ దోషిగా తేలేంత వరకు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చని.. చట్టంలోనే ఈ నిబంధన ఉందని ఆప్ చెబుతోంది. ప్రస్తుతం కేజ్రీవాల్ సీఎంగా ఉన్నా.. అతని దగ్గర ఎలాంటి పోర్టుపోలియోలు లేవని.. గతంలో అతని దగ్గర ఉన్న రెండు పోర్టుపోలియోల బాధ్యతలను ఇతర మంత్రులకు కేటాయించారని.. 

దీంతో పరిపాలనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ లో జైలులో ఉన్నా సీఎం హోదాలోనే ఉంటారని.. పరిపాలన మా మంత్రి వర్గం చూసుకుంటుందని.. ఢిల్లీ ప్రజలకు ఇబ్బంది ఇబ్బందులు ఉండవని స్పష్టం చేస్తుంది ఆప్. 

ALSO READ :- 11అసెంబ్లీ, 13 ఎంపీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా రిలీజ్

ఈ విషయంలో ఆప్ ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందనేది రాజకీయ విశ్లేషకుల వెర్షన్. ఆప్ చెబుతున్నట్లు సీఎం హోదాలో జైలు నుంచి పరిపాలన సాగించటం కష్టం అంటున్నారు. ఆ విధంగా కేజ్రీవాల్ ఎక్కువగా రోజులు సీఎం పదవిలో కొనసాగలేరని వెల్లడిస్తున్నారు. గతంలో చాలా మంది అరెస్ట్ అయిన సందర్భంలో.. సీఎం పదవికి రాజీనామా చేశారని.. మొన్నటికి మొన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయటం ద్వారా.. అసెంబ్లీలో మళ్లీ బల నిరూపణ చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో జయలలిత సైతం రాజీనామా చేసి పన్నీరు సెల్వంకు బాధ్యతలు అప్పగించారని.. కేజ్రీవాల్ కూడా రాజీనామా చేసి.. పార్టీలోని మరొకరికి సీఎం పదవి ఇవ్వొచ్చనే వాదన నడుస్తుంది. ఏదిఏమైనా ఆప్ అయితే కేజ్రీవాల్ విషయంలో గట్టిగానే ఉంది.. ఆయన జైలులో ఉన్నా.. సీఎంగా కొనసాగుతారని గట్టిగానే చెబుతోంది.. రాబోయే రోజుల్లో ఢిల్లీ పాలిటిక్స్ ఏ మలుపు తిరుగుతాయో చూడాలి...