దసరా వరకు బీసీ ఆత్మగౌరవ భవనాలు పూర్తి చేస్తం : మంత్రి గంగుల

దసరా వరకు బీసీ ఆత్మగౌరవ భవనాలు పూర్తి చేస్తం : మంత్రి గంగుల

హైదరాబాద్, వెలుగు: దసరా నాటికి బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఉప్పల్ భగాయత్‌‌‌‌‌‌‌‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌తో కలిసి వంజన కుల ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన చేశారు. తర్వాత గంగుల మాట్లాడుతూ, స్వాతంత్ర్య భారత చరిత్రలో సీఎం కేసీఆర్ ఒక్కరే బీసీలను పట్టించుకున్నారని తెలిపారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 41 కుల సంఘాలకు వేల కోట్ల రూపాయల విలువైన 87.3 ఎకరాల భూమిని కేటాయించి, ఆత్మ గౌరవంతో తలెత్తుకునేలా చేశారన్నారు. ఆదివారం ఇక్కడే మరో 13 కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణాలు ప్రారంభిస్తామని తెలిపారు. దసరా నాటికి అన్ని కులాలకు సకల సౌకర్యాలతో భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఉప్పల్ భగాయత్, కోకాపేటలోని భూములకు రోడ్లు, డ్రైనేజీలు, తాగు నీటి సదుపాయం సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.