పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా : రాజాసింగ్

పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా :  రాజాసింగ్

పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేసేందుకు తాను సిద్దమని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన మనసులో మాటను బయటపెట్టారు.  అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. పార్టీ ఎవరిని నియమించిన కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పారు.  మంచి వ్యక్తికే పార్టీ  ఆ బాధ్యతలు అప్పగిస్తుందని ఆశిస్తున్నానని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.  ఇక తాను ప్రభుత్వాన్ని కూలగొడతానని అనలేదన్నారు రాజాసింగ్.   ఆ పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని చెప్పానన్నారు.   

గత సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి వెళ్లారన్నారని ఆరోపించారు రాజాసింగ్. మరి ఇప్పుడు ఈ సర్కార్ నిధుులు ఎక్కడినుండి తీసుకు వస్తు్ందని ప్రశ్నించారు.   అక్బరుద్దీన్‌ ముందుకు ప్రమాణం చేసేది లేదన్న మాటకు కట్టుబడి ఉన్నామన్నారు రాజాసింగ్. అందుకే స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ముందు ప్రమాణం చేశామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒకటేనని విమర్శించారు