ఎలన్ మస్క్ కొత్త ట్విట్టర్ పోల్

ఎలన్ మస్క్ కొత్త ట్విట్టర్ పోల్

ట్విట్టర్ అధినేతగా కొనసాగడంపై ఎలాన్ మస్క్ పునరాలోచనలో పడ్డాడా ? తాను పగ్గాలు చేపట్టిన అనంతరం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడా?  ట్విట్టర్ లో ఆయన చేసిన పోస్ట్ చూసిన వారికి ఇవే సందేహాలు కలుగుతున్నాయి. ఆదివారం మస్క్ ‘ట్విటర్ అధినేత పదవి నుంచి తప్పుకోవాలా? ఈ పోల్ ఫలితాలకు కట్టుబడి ఉంటాను’ అని ట్విట్టర్ లో ఓ పోల్ నిర్వహించాడు. అంతేకాదు  ‘ట్విట్టర్ లో మున్ముందు అనేక మార్పులు తీసుకురాబోతున్నాను. వాటి పరిణామాలకు ఇప్పుడే క్షమాపణ చెప్తున్నాను’ అని మరొక ట్వీట్ పెట్టాడు. 

ట్విట్టర్ లో తీసుకొస్తున్న మార్పుల కారణంగా కొంతకాలంగా కంపెనీ ఉద్యోగులతో పాటు యూజర్లు నుంచి మస్క్ కు వ్యతిరేకత ఎదురవుతోంది. వీటిపై స్పందించిన మస్క్ యూజర్ల ఫీడ్ బ్యాక్ కోసం ఈ ట్వీట్లు చేశాడు. అయితే, ఈ పోల్ లో పాల్గొన్న వాళ్లలో 56.3 శాతం మంది అధినేతగా కొనసాగాలని, 43.7 శాతం మంది వద్దు అని జవాబిచ్చారు.