వచ్చే 25 ఏళ్ల దాకా బీజేపీని పవర్‌లోకి రానివ్వబోం

వచ్చే 25 ఏళ్ల దాకా బీజేపీని పవర్‌లోకి రానివ్వబోం

ముంబై: ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి బెయిల్ లభించింది. అయితే ఈ కేసులో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, అన్వయ్ నాయక్ కుటుంబీకుల మధ్య భూ ఒప్పందాలు ఉన్నాయంటూ వదంతులు వస్తున్నాయి. వీటిపై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఈ కేసును పక్కదారి పట్టించేందుకే ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారంటూ బీజేపీ మీద ఫైర్ అయ్యారు. రాబోయే 25 ఏళ్ల వరకు మహారాష్ట్రలో బీజేపీని అధికారంలోకి రానివ్వబోమని రౌత్ చెప్పారు. బీజేపీ సేట్ల పార్టీ అని పేర్కొన్నారు.