బోనాల జాతరకు సహకరించిన సేవకులకు ఈ నెల31న సన్మానం

బోనాల జాతరకు సహకరించిన సేవకులకు ఈ నెల31న సన్మానం

లష్కర్ బోనాల జాతరను విజయవంతం అయ్యే విధంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. దేవాదాయ అధికారులు, సిబ్బంది, పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ, ఎలక్ట్రికల్, ఫైర్, జలమండలి, ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ, సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖతో పాటు అన్ని శాఖల అధికారులు సిబ్బంది తోపాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించి పండుగను విజయవంతం అయ్యేందుకు  కృషిచేసారన్నారు. ఈ నెల 31న జాతరను విజయవంతం చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తోపాటు ఇతర సేవకులకు సన్మానించనున్నట్టు చెప్పారు. పార్టీలకతీతంగా అందరికీ సమాన గౌరవం ఇచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు వీలు కల్పించి, దక్కన్ సేవా సమితి, స్వచ్చందలు,హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తో పాటు కానిస్టేబుల్ అధికారి వరకు అందరూ పనిచేశారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గతంలో బోనాల పండుగకు అమ్మవారి దర్శించుకొని మంచి వర్షాలు పడాలని కోరుకునే పరిస్థితులను చూశామన్న మంత్రి... ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వర్షాలు పుష్కలంగా పడుతున్నాయని స్పష్టం చేశారు.