- ఇది విగ్రహం కాదు..విప్లవం
- అంబేద్కర్ బాటలో పోరాడుతా..దేశాన్ని సరైన లైన్లో పెడ్త: కేసీఆర్
- శత్రువులకు మింగుడు పడకపోవచ్చు.. కేంద్రంలో రాబోయే రాజ్యం మనదే
- మహారాష్ట్రలో ఆదరణ దక్కింది.. యూపీ, బీహార్, బెంగాల్‌లోనూ దక్కుతది
- ఏటా ‘అంబేద్కర్ అవార్డులు’ ఇస్తం.. ఇందుకు 51 కోట్లు డిపాజిట్ చేస్తం
- ఈ ఏడాది రాష్ట్రంలో 1.25 లక్షల మందికి దళితబంధు..
- కేంద్రంలో పవర్లోకి వస్తే దేశమంతా ఏటా 25 లక్షల మందికి ఇస్తమని ప్రకటన
- 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం
- ఈ నెల 30న సెక్రటేరియెట్ ప్రారంభిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దేశాన్ని సరైన లైన్లో పెట్టడానికి చివరి రక్తపుబొట్టు వరకు అంబేద్కర్ బాటలో పోరాడుతానని, ఎక్కడా రాజీ పడే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్ అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో రాబోయే రాజ్యం తమదేనని తెలిపారు. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం సభలో ఆయన ‘జై భీమ్’ నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ఇది విగ్రహం కాదు.. ఒక విప్లవం. ఇది కేవలం ఆకారానికి ప్రతీక కాదు.. ఇది తెలంగాణ కలలను సాకారం చేసే ఒక చైతన్య దీపిక” అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన పేరిట అవార్డులను అందజేస్తామని సీఎం ప్రకటించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా ఏటా 25లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు ఇస్తామని తెలిపారు. ‘‘నిజంగా పని చేసే వారిని ప్రోత్సహిస్తే మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కేంద్రంలో రాబోయే రాజ్యం మనదే మనదే.. ఇది మన శత్రువులకు మింగుడు పడకపోవచ్చు”అని అన్నారు.
హైదరాబాద్, వెలుగు: దేశాన్ని సరైన లైన్లో పెట్టడానికి చివరి రక్తపుబొట్టు వరకు అంబేద్కర్ బాటలో పోరాడుతానని, ఎక్కడా రాజీ పడే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్ అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో రాబోయే రాజ్యం తమదేనని తెలిపారు. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం సభలో ఆయన ‘జై భీమ్’ నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ఇది విగ్రహం కాదు.. ఒక విప్లవం. ఇది కేవలం ఆకారానికి ప్రతీక కాదు.. ఇది తెలంగాణ కలలను సాకారం చేసే ఒక చైతన్య దీపిక” అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన పేరిట అవార్డులను అందజేస్తామని సీఎం ప్రకటించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా ఏటా 25లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు ఇస్తామని తెలిపారు. ‘‘నిజంగా పని చేసే వారిని ప్రోత్సహిస్తే మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కేంద్రంలో రాబోయే రాజ్యం మనదే మనదే.. ఇది మన శత్రువులకు మింగుడు పడకపోవచ్చు”అని అన్నారు.
రాష్ట్రంలో 50వేల మందికి దళితబంధు ఇచ్చినం
రాష్ట్రంలో ఇప్పటిరకు 50 వేల మందికి దళితబంధు అందిందని సీఎం చెప్పారు. ఈ సంవత్సరం మరో 1.25 లక్షల మందికి దళితబంధు అమలు చేస్తామని ప్రకటించారు. ఎస్సీల అభ్యున్నతి కోసం తెచ్చిన కార్యక్రమం దళితబంధు అని, వాస్తవ కార్యాచరణ దిశగా ఎస్సీ మేధావులు కదలాలని అన్నారు. ‘‘అంబేద్కర్ మహనీయుడని జయంతి సందర్భంగా నేను ప్రకటిస్తా ఉన్న.. కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దేశంలో ప్రతి సంవత్సరం 25 లక్షల దళిత కుటుంబాలకు.. తెలంగాణ దళితబంధు లాంటి దళితబంధును అమలు చేస్తం. అన్ని రాష్ట్రాల వాళ్లకి కూడా ఈ సదుపాయం అందుతుంది” అని పేర్కొన్నారు. ‘‘అంబేద్కర్ రిలవెన్స్ ఇంకా ఉంది. ఆయన కలలు ఇంకా నెరవేరలేదు. నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వారి కలాలు సాకారం కావాలి.. అవుతాయి. ఆయన అనుకున్న ఎన్నో విషయాలు అయినయ్. ఎవరైతే నిజమైన భక్తితో పేద ప్రజలను ఆశీర్వదించే దిశగా పోతున్నారో వారికే మీ అందరి బలం అందాలి. మనం చీలిపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు పోతే తప్పక విజయం మనదే” అని ఆయన అన్నారు.
దళితుల కోసం రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు పెట్టినం
‘‘చాలా రోజులుగా నేను చెప్తా ఉన్న.. ఈ దేశంలో ప్రజలు గెలిచే రాజకీయం రావాలి. దానికోసం దళితమేధావి వర్గం కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తున్నదో రెండు, మూడు విషయాలు మీముందు పెడ్తాను. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఇక్కడ 10 సంవత్సరాలు వేరే పార్టీ రాజ్యం చేసింది. వాళ్ల కాలంలో ఆ పదేండ్లలో దళితుల అభివృద్ధి కోసం పెట్టిన ఖర్చు కేవలం 16 వేల కోట్లు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేండ్లలో ఈ సంవతర్సరం బడ్జెట్కూడా కలుపుకుని దళితుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన డబ్బు రూ.1,25,068 కోట్లు. ఇది స్టోరీ కాదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అకౌంట్ల నిర్ధారణ” అని సీఎం కేసీఆర్ తెలిపారు. సెక్రటేరియెట్‌కు కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని, దాన్ని ఈ నెల 30న ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. ‘‘అంబేద్కర్ విగ్రహం ఎవరో డిమాండ్ చేస్తేనో.. చెప్తెనో ఏర్పాటు చేసుకోలేదు. ఇంత అద్భుతమైన విశ్వరూపాన్ని.. ఈ మూర్తి రూపంలో ప్రతిష్టుంచుకున్నామంటే ఇందులో ఒక మెస్సెజ్ ఉంది. అంబేద్కర్ విగ్రహం సమీపంలోనే బుద్ధుడి విగ్రహం, అమర వీరుల స్మారకం, పరిపాలన సౌదం సెక్రటేరియేట్ఉన్నాయి. రోజూ సెక్రటేరియెట్ వచ్చే ముఖ్యమంత్రికి కానీ.. మంత్రులకు కానీ.. సెక్రటరీలకు కానీ ఎప్పటికప్పుడు అంబేద్కర్ సిద్ధాంతం, ఆచరణ కళ్లలో మెదలాలని ఈ విధంగా రూపకల్పన చేశాం”అని వివరించారు. ‘‘చాలా గర్వంగా ఉంది. దేశంలోనే ఎక్కడా లేనటువంటి, అద్భుతమైనటువంటి ఈ ఆదర్శమూర్తి విగ్రహాన్ని ఇంత గొప్పగా తీర్చుదిద్దుకున్నందుకు.. ఈ అవకాశం నాకే కలిసివచ్చినందుకు నా జన్మ ధన్యమైంది.. జై భీమ్.. జై భీమ్’’ అని కేసీఆర్ అన్నారు.
అంబేద్కర్ పేరిట ఏటా అవార్డులు
అంబేద్కర్ పేరిట శాశ్వతమైన అవార్డును నెలకొల్పితే బాగుంటుందని కత్తి పద్మారావు సూచించారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు అంబేద్కర్ పేరిట అవార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదేశిస్తున్నదని అన్నారు. ఇందుకోసం రూ.51కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నామని ప్రకటించారు. దేశంలో, రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించినోళ్లకు ఏటా అంబేద్కర్ జయంతి రోజున అవార్డులు ఇస్తామని తెలిపారు. రూ. 51 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి సంవత్సరానికి రూ. 3 కోట్ల వడ్డీ వస్తుందని, దీంతో అవార్డులు అందజేస్తామని ఆయన అన్నారు.ఈ మధ్య మహారాష్ట్రకు పోతే ఊహించని విధంగా ప్రోత్సాహం, ఆదరణ లభించింద ని కేసీఆర్ తెలిపారు. ‘‘రేపు యూపీలో, బీహార్‌లో, బెంగాల్‌లో ఇలాంటి ఆదరణే వస్తది. కచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే” అని పేర్కొన్నారు.
హెలికాప్టర్ ద్వారా పూలవర్షం
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా బౌద్ధ భిక్షవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం.. బేస్ భవనంలోని అంబేద్కర్ ఫొటో ఎగ్జిబిషన్ ను కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ తిలకించారు. ఆ తర్వాత సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ముందుగా దండు మల్కాపూర్‌లో డిక్కీ (దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ)కి రెండు ఎకరాల స్థల కేటాయింపుకు సంబంధించిన పత్రాలను సీఎం కేసీఆర్ అందజేశారు. అనంతరం దళితబంధుపై సీడీని అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ చేత ఆవిష్కరింపజేశారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏండ్లు దాటింది. ఏటా అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్నాం.. పాటలు పాడుతున్నాం.. ఆడుతున్నాం. ఇట్లా సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతున్నాయి. అంబేద్కర్ జయంతులు జరుపుకుంటూ పోవడమేనా..?! ఆయన చెప్పింది ఆచరించేది ఏమైనా ఉందా?! ఆ దిశగా కార్యాచరణ ఏమైనా ఉందా.. లేదా? ఇది భారతదేశం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. ఆటలు, పాటలు, వలపోతలు కాదు. కార్యాచరణ ప్రారంభం కావాలి. రోజూ సెక్రటేరియెట్‌కు వచ్చే ముఖ్యమంత్రికి కానీ.. మంత్రులకు కానీ.. సెక్రటరీలకు కానీ ఎప్పటికప్పుడు అంబేద్కర్ సిద్ధాంతం, ఆచరణ కండ్లలో మెదలాలని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నం.
- సీఎం కేసీఆర్
