కేసీఆర్ మళ్లీ మోడీకి దగ్గరవుతారా?

కేసీఆర్ మళ్లీ మోడీకి దగ్గరవుతారా?

రెండవ సారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడి రేపు ఢిల్లీలో ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది సందేహామే. ఎందుకంటే ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశ రాజకీయాలను మారుద్దామని మోడీకి వ్యతిరేకంగా పొలిటికల్ క్యాంపెయినింగ్ చేశారు  కేసీఆర్. అయితే ఊహించని విధంగా, ఎలాంటి పొత్తులు లేకుండా బీజేపీ  భారీ మెజారిటితో గెలిచింది. మోడీకి అఖండ విజయాన్ని అందించింది.

ఏపీ రాష్ట్రానికి కాబోయే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం కూడా రేపే జరగనుండగా.. సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒకే విమానంలో ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరుతారని సమాచారం. మోడీతో భేటి అయి ఇరు రాష్ట్రాల ఎదుర్కొంటున్న సమస్యలను, రాష్ట్రాల అభివృద్ధికి కావాల్సిన నిధుల గురించి చర్చించనున్నట్టు సమాచారం.

ఎన్నికల సమయంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ప్రయత్నాలు చేశారు కేసీఆర్. బీజేపీ హవా తగ్గిందని, లోక్ సభ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ దేనని,  కారు.. పదహారు.. అని ఎన్నికల సమయంలో నినదించారు.

మరి ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఎన్నికైన ప్రధాని అభ్యర్థి  మోడీని KCR  ఏ విధంగా తమ రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తాడు ?  మళ్లీ మోడీకి ఎలా దగ్గరవుతారనే అనుమానం  ప్రజలందరిలో ఉంది.