లాక్ డౌన్ వేసే ప్రసక్తే లేదు

లాక్ డౌన్ వేసే ప్రసక్తే లేదు

లక్నో: దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ వేసే దిశగా సమాలోచనలు చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ మీదే ఇవ్వాళ నిర్ణయం తీసుకోనుంది. అవసరం వస్తే లాక్ డౌన్ విధించేందుకు అస్సలు వెనుకాడబోమని కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప అన్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తమ రాష్ట్రంలో లాక్ డౌన్ వేయబోమని యోగి స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎక్కువ టెస్టులు అవసరమైతే ప్రైవేట్ లాబ్స్ లో చేయిస్తామని, ఆ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల సేవలను సమయానికి అనుగుణంగా వాడుకుంటామని తెలిపారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.