అమెజాన్ సీఈవోగా తప్పుకోనున్న బెజోస్

అమెజాన్ సీఈవోగా తప్పుకోనున్న బెజోస్

న్యూయార్క్: ప్రముఖ బిలియనీర్, అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి త్వరలో తప్పుకోనున్నట్లు ప్రకటించారు. జూలై 5న తన స్థానంలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జస్సీ కొత్త సీఈవోగా చార్జ్ తీసుకుంటారని తెలిపారు. ఈ తేదీ తనకు చాలా ముఖ్యమని, సరిగ్గా 27 ఏళ్ల కింద 1994లో అమెజాన్‌ను స్థాపించామని షేర్ హోల్డర్లతో జరిగిన మీటింగ్‌‌లో బెజోస్ పేర్కొన్నారు. కాగా, కంపెనీ సీఈవో పదవి నుంచి బెజోస్ తప్పుకుంటారని ఫిబ్రవరిలోనే అమెజాన్ ప్రకటించింది. అయితే ఏ తేదీన తప్పుకుంటారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా బెజోస్ ప్రకటనతో దీనిపై క్లారిటీ వచ్చింది.