
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు కొద్దికొద్దిగా తగ్గుతున్నాయి. ఇక నుంచి కూడా ఇదే పోకడ కొనసాగితే మనదేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరల చౌక అవుతాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలలో మరింత తగ్గితే తామూ తగ్గిస్తామని అంటున్నాయి. మనదేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు 15 రోజుల రోలింగ్ యావరేజ్ బట్టి ఉంటాయి. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు మరింత తగ్గితే, 15 రోజుల రోలింగ్ యావరేజ్ కూడా తగ్గుతుంది. ఫలితంగా డొమెస్టిక్ మార్కెట్‌లోనూ ధరలు పడిపోతాయి. మన ఆయిల్ కంపెనీలు రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. కానీ, ఈ ధరల మార్పు క్రూడాయిల్15 -రోజుల రోలింగ్ యావరేజ్‌పై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల్లో భారీ హెచ్చుతగ్గుల నుంచి మనదేశంలోని పెట్రోల్, డీజిల్ కస్టమర్లను రక్షించడానికి ఇలా చేస్తారు. ‘‘ఇంటర్నేషనల్ మార్కెట్లో శుక్రవారం క్రూడ్ రేట్లు తగ్గాయి. దీనివల్ల రిటైల్ రేట్లు తగ్గవు. రేట్ల తగ్గుదల మరికొద్ది రోజులు కొనసాగితేనే తగ్గుదలను ఆశించవచ్చు" అని సంబంధిత ఆఫీసర్ ఒకరు చెప్పారు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఈ నెల దాదాపు పది డాలర్లు తగ్గి బ్యారెల్‌కు 72.91 డాలర్లు పలుకుతోంది. అంతర్జాతీయంగా ధరలను తగ్గించడానికి కొన్ని దేశాలు తమ రిజర్వుల నుండి క్రూడాయిల్‌ను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓపెక్ ప్లస్ దేశాలు వచ్చే నెల మొదటివారంలో భేటీ అవుతున్నాయి. వీటి నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది.