వికారాబాద్, వెలుగు: జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ కోటిరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జిల్లాకు పోలీస్ అభ్యర్థులు శిక్షణకు రానున్నట్టు చెప్పారు. పోలీస్ సిబ్బందికి వసతులలో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అన్ని రకాల సౌలత్లు కల్పిస్తామన్నారు.
పరేడ్ గ్రౌండ్, బ్యారక్లకు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, తరగతి గదులు, వంటగది, క్లాస్ రూమ్స్, బీవోఏసీ ట్రాక్ మొదలైన వాటిని ఆయన పరిశీలించారు. ఆయన వెంట డీటీసీ ప్రిన్సిపాల్ మురళీధర్ ఉన్నారు.
